Odisha: వ్యతిరేకతతో వెనక్కి తగ్గిన మాఝీ ప్రభుత్వం
ABN , Publish Date - Jul 21 , 2024 | 08:36 PM
పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారితే పథకాల పేర్లు మారుతాయి. మరికొన్ని రాష్ట్రాల్లో అయితే పురస్కారాలు పేర్లు సైతం మారిపోతాయి. ఒడిశాలో తాజాగా అదే జరిగింది. గత నవీన్ పట్నాయక్ ప్రభుత్వ హయాంలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బిజు పట్నాయక్ స్పోర్ట్స్ అవార్డు అందజేసేది.
భువనేశ్వర్, జులై 21: పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారితే పథకాల పేర్లు మారుతాయి. మరికొన్ని రాష్ట్రాల్లో అయితే పురస్కారాలు పేర్లు సైతం మారిపోతాయి. ఒడిశాలో తాజాగా అదే జరిగింది. గత నవీన్ పట్నాయక్ ప్రభుత్వ హయాంలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బిజు పట్నాయక్ స్పోర్ట్స్ అవార్డు అందజేసేది. అయితే ఆ అవార్డు పేరును మోహన్ చరణ్ మాఝీ ప్రభుత్వం మార్చాలని నిర్ణయించింది. అందుకు సంబంధించిన గైడ్ లైన్స్ సైతం శుక్రవారం విడుదల చేసింది.
Also Read: Union Budget 2024: రికార్డు సృష్టించనున్న నిర్మలమ్మ
ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్ర తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దాంతో ఈ నిర్ణయంపై మాంఝీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. బిజు పట్నాయక్ స్పోర్ట్స్ అవార్డు పేరు మార్చడం లేదని ఆదివారం ప్రభుత్వం ప్రకటించింది. ఒడిశా రాష్ట్రానికి బిజు పట్నాయక్ అందించిన సేవలకు గుర్తుగా అవార్డు పేరు మార్చడం లేదని సీఎం మోహన్ చరణ్ మాఝీ వివరణ ఇచ్చారు. అలాగే ఈ ఒడిశా నేలపైన, ఇక్కడ జన్మించిన వారిపైన తమ ప్రభుత్వానికి గౌరవముందని ఆయన స్పష్టం చేశారు. ఆగస్ట్ 29వ తేదీ క్రీడా దినోత్సవం.
Also Read: Haryana: హర్యానాలోని నుహ్‌లో ఇంటర్నెట్ సేవలు బంద్
ఈ సందర్భంగా ప్రతీ ఏటా ఆ రోజు.. రాష్ట్రంలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు పలు కేటగిరిల్లో ప్రభుత్వం అవార్డులను ప్రకటిస్తుంది. అలాగే ఈ అవార్డుతోపాటు నగదు సైతం అందచేస్తుంది. క్రీడాకారుల ఎంపిక కోసం ప్రభుత్వం అయిదుగురి సభ్యులతో కూడిన ఓ కమిటిని ఏర్పాటు చేసింది. మరోవైపు ఈ అవార్డు పేరు మార్పుపై బీజేడీ ఎమ్మెల్యే అరుణ్ సాహు మండిపడ్డారు. మాజీ సీఎం బిజు పట్నాయక్ వ్యక్తి కాదని.. ఆయన ఓ శక్తి అని పేర్కొన్నారు. ఆయన జాతీయ ఆస్తిగా అభివర్ణించారు.
Also Read: Mamata Banerjee: బంగ్లా బాధితులకు ఆశ్రయం.. కీలక ప్రకటన
Also Read: New Delhi: జగన్ పాలనలో అప్పులు ఘనం.. అభివృద్ధి శూన్యం
అంతేకాదు.. బిజు పట్నాయక్ సేవలను ఆయన పరిపాలన దక్షతను వివిద దేశాలు సైతం గుర్తించి సన్మానించాయని గుర్తు చేశారు. మరోవైపు గత బీజేడీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన పలు పథకాల పేర్లను సైతం కొత్తగా కొలువు తీరిన మాఝీ ప్రభుత్వం మారుస్తుంది.
Also Read: Vizianagaram: శ్రీ విద్యా పీఠంలో గురుపౌర్ణమి వేడుకలు
Also Read: Arvind Kejriwal: బీజేపీతోపాటు ఎల్జీపై మళ్లీ మండిపడ్డ ఆప్
దాంతో ఈ కొత్త ప్రభుత్వ వైఖరిని బీజేడీ తప్పుపడుతుంది. ఇటీవల ఒడిశా అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఒడిశా ఓటరు బీజేపీ పట్టం కట్టాడు. దాంతో మోహన్ చరణ్ మాఝీ కొత్తగా కొలువు తీరింది. నాటి నుంచి గత ప్రభుత్వం తీసుకు వచ్చిన పథకాలు, అవార్డుల పేర్లు మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News