BJP: బీజేపీ ఉగ్రవాదుల పార్టీ అన్న ఖర్గే.. కమలం పార్టీ మండిపాటు
ABN , Publish Date - Oct 13 , 2024 | 07:51 AM
బీజేపీ టెర్రరిస్టుల పార్టీ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ శనివారం ఆగ్రహం వ్యక్తం చేసింది. టెర్రరిస్టులకు అండగా నిలిచేది ప్రతిపక్ష పార్టీనే అంటూ విమర్శలు గుప్పించింది.
ఇంటర్నెట్ డెస్క్: బీజేపీ టెర్రరిస్టుల పార్టీ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ శనివారం ఆగ్రహం వ్యక్తం చేసింది. టెర్రరిస్టులకు అండగా నిలిచేది ప్రతిపక్ష పార్టీనే అంటూ విమర్శలు గుప్పించింది. త్రిపుల్ తలాక్, హలాలా, హిజాబ్ సంప్రదాయాలకు వత్తాసు పలికిన కాంగ్రెస్ నేడు హిందూ సమాజంపై నిరాధార ఆరోపణలు చేస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేదీ మండిపడ్డారు. ప్రధాని మోదీ ప్రస్తావించిన అర్బన్ నక్సల్స్ ఆలోచనా ధోరణి అంటే ఇదేనని అన్నారు.
ఇటీవల మోదీ కాంగ్రెస్‌ను అర్బన్ నక్సల్స్ గ్యాంగ్ అని విమర్శించిన విషయం తెలిసిందే. దీనిపై ఖర్గే స్పందిస్తూ బీజేపీ ఉగ్రవాదుల పార్టీ అని విమర్శించారు.
Baba Siddique: మాజీ మంత్రి బాబా సిద్ధిక్ హత్య.. భారీ భద్రతతో ఆస్పత్రికి సల్మాన్ ఖాన్
కాగా, ఖర్గే వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కూడా స్పందించారు. ఖర్గే వ్యాఖ్యలు ఆయనకు తన సొంత పార్టీపై ఉన్న అభిప్రాయమని అన్నారు. మరో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ కూడా ఖర్గేను టార్గెట్ చేశారు. ఆయన నోరు జారీ బీజేపీని అలా అనుండొచ్చని, వాస్తవానికి సోనియా గాంధీ.. బాట్లా హౌస్ వద్ద మరణించిన టెర్రరిస్టుల కోసం కన్నీరు కార్చారని ఆరోపించారు. అఫ్జల్ గురు విషయంలో ఉదాసీనంగా ఉన్నదీ, పోటా చట్టాన్ని రీఅప్పీల్ చేసిందీ కాంగ్రెస్‌యేనని చెప్పారు. మోదీ హయాంలో ఉగ్రకార్యకలాపాలు చాలా వరకూ తగ్గుముఖం పట్టాయని చెప్పారు.
Farooq Abdullah: సమయం ఇదే.. కశ్మీర్ పండిట్లు వెనక్కి రావాలి
బీజేపీ ప్రతినిధి సీఆర్ కేశవన్ మాట్లాడుతూ ఖర్గే వ్యాఖ్యలు కాంగ్రెస్ పక్షపాత ధోరణి, విషతుల్య ఆలోచనా ధోరణిని బయటపెట్టాయని అన్నారు. బ్రిటీష్ వలసపాలకులు లాగా విభజించి పాలించడమే కాంగ్రెస్ విధానమని విమర్శించారు. ‘‘ఉగ్రవాదాన్ని హిందూ సమాజంతో పోల్చుతూ 2013లో కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యల్ని దేశం మర్చిపోకూడదు. ఏకంగా కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ శిండే, హిందూ ఉగ్రవాదం అంటూ అవమానకర వ్యాఖ్యలు చేశారు’’ అని అన్నారు.
Read More National News and Latest Telugu News