Share News

JP Nadda: బీజేపీకి ఆర్ఎస్ఎస్ అవసరంపై నడ్డా కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - May 18 , 2024 | 09:40 PM

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ముందుడి బీజేపీని నడిపిస్తోందనే అభిప్రాయంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.

JP Nadda: బీజేపీకి ఆర్ఎస్ఎస్ అవసరంపై నడ్డా కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) ముందుడి బీజేపీ (BJP)ని నడిపిస్తోందనే అభిప్రాయంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. గతంలో ఉన్న బీజేపీకి, ఇప్పుడున్న బీజేపీకి చాలా తేడా ఉందన్నారు. అటల్‌జీ (Atal Bihari Vajpeyee) హయాంతో పోల్చుకుంటే ఇప్పుడు పార్టీ చాలా బలపడిందని, సొంత సామర్థ్యాన్ని సాధించుకుందని చెప్పారు. అప్పట్లో ఆర్ఎస్ఎస్‌పై ఆధారపడినా ఇప్పుడా పరిస్థితి మారిందన్నారు.


ఆర్ఎస్ఎస్ అవసరం ఇప్పుడు కూడా ఉందని అనుకుంటున్నారా అని నడ్డాను ప్రశ్నించగా, బీజేపీ బాగా బలపడిందని, ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలు, పాత్రలను సక్రమంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. ఆర్ఎస్ఎస్ సాంస్కృతిక, సామాజిక సంస్థ అని, తమది రాజకీయ సంస్థ అని చెప్పారు. అవసరమా అనేది ఇక్కడ ప్రశ్న కాదని, ఆర్ఎస్ఎస్ ఒక సైద్ధాంతిక ఫ్రంట్ అని చెప్పారు. ఒక పార్టీగా తాము సొంతంగానే వ్యవహారాలు చక్కబెట్టుకుంటామని, సహజంగా అన్ని పార్టీలు చేసేది కూడా అదేనని చెప్పారు.

Lok Sabha Elections: పాక్‌కు టిక్కెట్ కొనిస్తా, అక్కడకు వెళ్లి రిజర్వేషన్లు ఇచ్చుకోండి..


ఆ ఆలయాలపై అలాంటి ప్లాన్ లేదు..

ఉత్తరప్రదేశ్‌లోని మధుర, వారణాసి వివాదాస్పద స్థలాల్లో ఆలయాల నిర్మాణంపై అడిగినప్పుడు, అలాంటి ప్లాన్స్ ఏమీ లేవని నడ్డా జవాబిచ్చారు. దీనిపై చర్చలు కూడా జరగలేదని చెప్పారు. పార్టీ వ్యవస్థ, పనితీరు ప్రకారం, పార్లమెంటరీ బోర్డులో తొలుత డిస్కషన్లు జరుగుతాయని, ఆ తర్వాత నేషనల్ కౌన్సిల్‌కు వెళ్లి దాన్ని ఆమోదించడం జరుగుతుందని చెప్పారు.

Read Latest National News and Telugu News

Updated Date - May 18 , 2024 | 09:44 PM