Suvendu: సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Jul 17 , 2024 | 05:45 PM
లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్ నుంచి ఆశించిన స్థాయిలో బీజేపీ సీట్లు గెలుచుకోకపోవడంతో ఆ పార్టీ రాష్ట్ర విభాగం నేత సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్‌లో బీజేపీ మైనారిటీ మోర్చా ను రద్దు చేయాలన్నారు.
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్ (West Bengal) నుంచి ఆశించిన స్థాయిలో బీజేపీ సీట్లు గెలుచుకోకపోవడంతో ఆ పార్టీ రాష్ట్ర విభాగం నేత సువేందు అధికారి (Suvendu Adhikari) కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్‌లో బీజేపీ మైనారిటీ మోర్చా (Minority Morcha) ను రద్దు (Scrapped) చేయాలన్నారు. పార్టీ ఇచ్చిన 'సబ్‌కా సాథ్ సబ్‌కా వికాశ్' నినాదం కూడా చేయవద్దని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 'జో హమారే సాత్ హమ్ ఉన్కే సాత్' అనే కొత్త నినాదం కూడా ఆయన ఇచ్చారు.
కోల్‌కతాలో జరిగిన రాష్ట్ర బీజేపీ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో సువేందు అధికారి మాట్లాడుతూ, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఫలితాలు నిరాశపరచడానికి రాష్ట్రంలోని మైనారిటీలు సహకరించకపోవడమే కారణమని అన్నారు. పార్టీ మైనారిటీ మోర్చాను రద్దు చేయాల్సిందేనని పేర్కొన్నారు. ''నేను జాతీయవాద ముస్లింల గురించి మాట్లాడితే సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ అంటూ అంతా నినాదాలు చేసేవారు. అయితే ఇక నుంచి నేను ఆ నినాదాన్ని పలకను. ఎవరైతే మాతో ఉంటారో వారితో మేము ఉంటాం (జో హమారా సాత్, హమ్ ఉన్కే సాత్) అనే కొత్త నినాదాన్ని పలుకుతాను. మైనారిటీ మోర్చా అవసరం లేదు'' అని సువేందు అన్నారు.
Karnataka: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు... పోస్ట్ డిలీట్ చేసిన సీఎం
టీఎంసీ ఆక్షేపణ..
కాగా, సువేందు అధికారి వ్యాఖ్యలపై సీఎం మమతా బెనర్జీతో సహా టీఎంసీ నేతలు విమర్శలు గుప్పించారు. ప్రజలను మెజారిటీ, మైనిరిటీ అంటూ సువేందు విడగొడుతున్నారంటూ ఆక్షేపించారు. ప్రజాస్వామ్యం అంటే బీజేపీకి పడదని టీఎంసీ నేత కునాల్ ఘోష్ వ్యాఖ్యానించారు. బీజేపీ వాళ్లు మైనారిటీ ఫ్రంట్ అవంసరం లేదంటున్నారని, ఇది అప్రజాస్వామికమని అన్నారు. ''ఇక్కడ మెజారిటీ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్ల వంటి మైనారిటీలు ఉన్నారు. అన్ని ప్రజాస్వామ్య పార్టీలకు మైనారిటీ విభాగాలు ఉన్నాయి. బీజేపీ ప్రజాస్వామ్య పార్టీ అయితే తమకు అందరూ సమానమైనని చెప్పాలి'' అని కునాల్ ఘోష్ పేర్కొన్నారు.
సువేందు అధికారి తిరిగి వివరణ
కాగా, తన వ్యాఖ్యలపై సువేందు అధికారి తిరిగి వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలకు వక్రభాష్యం సరికాదన్నారు. చాలా స్పష్టమైన వైఖరితో తాము ఉన్నామని చెప్పారు. దేశానికి, బెంగాల్‌కు మద్దతుగా జాతీయవాద వైఖరితో ఎవరైతే ఉంటారో వారితోనే తాము ఉంటామని, ఇందుకు భిన్నంగా వ్యవహరించే వారి గుట్టు బయటపెడతామని చెప్పారు. మమతా బెనర్జీ తరహాలో తాము మెజారిటీ, మైనారిటీలుగా ప్రజలను విభజించి చూడమని, అందరినీ భారతీయులుగానే చూస్తామని అన్నారు. ప్రధాని సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్ నినాదాన్ని తూ.చ. తప్పకుండా అనుసరిస్తూ, అదే స్ఫూర్తితో పనిచేస్తామని చెప్పారు.
For Latest News and National News click here