Share News

Maharashtra: 'మహాయుతి' కూటమి సీట్ల షేరింగ్ ఫార్ములా ఇదే.. సీఎం ఆయనే

ABN , Publish Date - Oct 19 , 2024 | 03:30 PM

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 155 నుంచి 160 సీట్లలో పోటీ చేయనుంది. ఏక్‌నాథ్ షిండే శివసేన 75 నుంచి 80 సీట్లలోనూ, అజిత్ పవార్ ఎన్సీపీ 50 నుంచి 55 స్థానాల్లోనూ పోటీలోకి దిగనున్నాయి.

Maharashtra: 'మహాయుతి' కూటమి సీట్ల షేరింగ్ ఫార్ములా ఇదే.. సీఎం ఆయనే

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో (Maharashtra Assembly Elections) అధికార 'మహాయుతి' కూటమి మధ్య సీట్ల పంపకాల వ్యవహారం కొలిక్కి వచ్చినట్టు తెలిసింది. శనివారం సాయంత్రంలోగా అధికారిక ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు. మహారాష్ట్ర ముఖ్మమంత్రి ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్‌లు బీజేపీ వ్యూహకర్త, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను శుక్రవారం రాత్రి కలుసున్నారు. సీట్ల పంపకాలు కీలక దశకు చేరుకున్న దశలో అమిత్‌షాను మహాయుతి నేతలు కలుసుకోవడంతో వ్యవహారం కొలిక్కి వచ్చినట్టు చెబుతున్నారు.

భారత్‌లో 23.4 కోట్ల పేదలు


విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 155 నుంచి 160 సీట్లలో పోటీ చేయనుంది. ఏక్‌నాథ్ షిండే శివసేన 75 నుంచి 80 సీట్లలోనూ, అజిత్ పవార్ ఎన్సీపీ 50 నుంచి 55 స్థానాల్లోనూ పోటీలోకి దిగనున్నాయి.


ముఖ్యమంత్రి ఆయనే

ఏక్‌నాథ్ షిండేనే ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు కూటమి నేతల మధ్య అవగాహన కుదిరినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మహాయుతి కూటమి తిరిగి అధికారంలోకి వస్తే మంత్రివర్గ పదవులు మూడు పార్టీలకు సమంగా దక్కుతాయి. షెడ్యూల్ ప్రకారం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న ఒకే విడతలో జరుగనున్నారు. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈసారి మహాయుతి కూటమి విపక్ష వికాస్ ఆఘాడి (ఎంవీఏ) కూటమి నుంచి గట్టిపోటీని ఎదుర్కొంటుందని అంచనా వేస్తున్నారు. ఎంవీఏలోని కాంగ్రెస్-ఎన్‌సీఎస్‌పీ, శివసేన (యూబీటీ) పార్టీలు గత లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు అనుగుణంగానే ఈసారి కూడా తమకు ప్రజాతీర్పు వస్తుందని అంచనా వేస్తున్నాయి. ఇటీవల జరిగిన మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికల్లో 48 స్థానాల్లో ఎంవీఏ 31 స్థానాలు దక్కించుకుంది.


Read More National News and Latest Telugu News

ఇది కూడా చదవండి..

పన్నూ హత్యకు భారతీయుల కుట్ర

Updated Date - Oct 19 , 2024 | 04:11 PM