BJP state chief: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్స్.. ఇండియా కూటమి పేకాటలాంటిదే..
ABN , Publish Date - Jan 28 , 2024 | 01:07 PM
ఇండియా కూటమి పేకాటలాంటిదని, ఒక్కో రౌండ్‌కి ఒక జోకర్ బయటకు వెళుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) ఎద్దేవా చేశారు.
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఎద్దేవా
ప్యారీస్(చెన్నై): ఇండియా కూటమి పేకాటలాంటిదని, ఒక్కో రౌండ్‌కి ఒక జోకర్ బయటకు వెళుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) ఎద్దేవా చేశారు. కడలూరు జిల్లా బన్రూట్టిలో ‘ఎన్ మన్.. ఎన్ మక్కల్’ పాదయాత్రలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ అసెంబ్లీ ఎన్నికల హామీల్లో 99 శాతం నెరవేర్చినట్లు చెబుతున్నారని, అయితే కడలూరు జిల్లాలో తాను పర్యటించిన ప్రాంతాల్లో ఒక్క అభివృద్ధి పథకం కూడా అమలు జరగలేదని స్థానికులు తన వద్ద మొరపెట్టుకున్నారని తెలిపారు. గత తొమ్మిదేళ్లలో రూ.10.96 లక్షల కోట్ల నిధులను రాష్ట్రానికి కేంద్రం అందజేసిందని, అయితే ఈ నిధులు డీఎంకే(DMK) పాలకులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల మద్దతుతో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తొలి సంతకం టాస్మాక్ మద్యం దుకాణాలను మూసివేసి కల్లు దుకాణాలు ప్రారంభిస్తామన్నారు. పేక ముక్కల్లాంటి ఇండియా కూటమిలో మమతాబెనర్జీ, నితీ్‌షకుమార్ వంటి నాయకులు బయటకు వచ్చారని, మరికొన్ని రోజుల్లో మిగతా వారు కూడా వైదొలిగే అవకాశముందని అన్నామలై తెలిపారు.