Share News

BJP state president: తెగేసి చెప్పేశారు.. పాదయాత్ర ఆపేది లేదు

ABN , Publish Date - Jul 30 , 2024 | 12:40 PM

తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని, పాదయాత్ర ఆపే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర(BJP state president Vijayendra) తేల్చి చెప్పారు. ఆగస్టు 3నుంచి చలో మైసూరు పాదయాత్రపై సోమవారం సన్నాహక కమిటీ సమావేశం నిర్వహించారు.

BJP state president: తెగేసి చెప్పేశారు.. పాదయాత్ర ఆపేది లేదు

- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర

బెంగళూరు: తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని, పాదయాత్ర ఆపే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర(BJP state president Vijayendra) తేల్చి చెప్పారు. ఆగస్టు 3నుంచి చలో మైసూరు పాదయాత్రపై సోమవారం సన్నాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయేంద్ర మాట్లాడుతూ సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్‌(CM Siddaramaiah and DCM DK Shivakumar) తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రశ్నే లేదన్నారు. తమ పాదయాత్రకు అనుమతులు లేవని హోంశాఖ మంత్రి పరమేశ్వర్‌(Home Minister Parameshwar) వ్యాఖ్యలపై మండిపడ్డారు.

ఇదికూడా చదవండి: JNTU: జేఎన్‎టీయూలో బీఎఫ్ఎస్ఐ మైనర్‌ డిగ్రీ..


రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, వెనుకబడినవర్గాల సంక్షేమం కోసం తమ పోరాటం నిరంతరంగా ఉంటుందన్నారు. ఎస్టీ సామాజి వర్గానికి చెందిన గ్రాంట్లను లూటీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిపై పోరాటం చేయకుంటే భగవంతుడు మమ్మల్ని క్షేమించరని అన్నారు. ముడాలో రూ.3-4వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రతిపక్షనేతలు అశోక్‌, చలవాది నారాయణస్వామి, మాజీ సీఎం సదానందగౌడ, ముఖ్యనేతలు సునిల్‌కుమార్‌, ప్రీతం గౌడ, రాజీవ్‌, నందీశ్‌రెఇ్డ, బైరతి బసవరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: ‘సింగరేణి’ని కాపాడేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయండి

ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 30 , 2024 | 12:40 PM