Share News

BJP state president: నా పాదయాత్రతో ప్రభుత్వానికి ముచ్చెమటలు..

ABN , Publish Date - Aug 06 , 2024 | 11:16 AM

ముడా అక్రమాలను నిరసిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్‌తో మూడోరోజు చలో మైసూరు పాదయాత్ర కొనసాగింది. కెంగల్‌ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర(BJP state president Vijayendra) మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి శూన్యమని, లూటీలే ఈ ప్రభుత్వానికి ప్రధానం అన్నారు.

BJP state president: నా పాదయాత్రతో ప్రభుత్వానికి ముచ్చెమటలు..

- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర

బెంగళూరు: నా పాదయాత్రతో ప్రభుత్వానికి ముచ్చెమటలు పడుతున్నాయని బీజేపీ రాష్ట్ర చీఫ్ విజయేంద్ర అన్నారు. ముడా అక్రమాలను నిరసిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్‌తో మూడోరోజు చలో మైసూరు పాదయాత్ర కొనసాగింది. కెంగల్‌ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర(BJP state president Vijayendra) మీడియాతో మాట్లాడుతూ.. అభివృద్ధి శూన్యమని, లూటీలే ఈ ప్రభుత్వానికి ప్రధానం అన్నారు. కేరళ రాష్ట్రం వయనాడ్‌(Kerala state Wayanad)లో వంద ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి(Chief Minister) ప్రకటించడం సంతోషకరమన్నారు. కానీ ఆయనకు శక్తినిచ్చిన మైసూరులో వేలాదిమంది పేదలు ఇంటి స్థలాల కోసం దరఖాస్తులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

ఇదికూడా చదవండి: Deputy CM: నా ఆస్తులు వెల్లడిస్తా.. మరి.. కుమారస్వామి సోదరుడి ఆస్తులు చెప్పాలి


వారిపట్ల ఎందుకు మీకు దయలేదని ప్రశ్నించారు. మీ కుటుంబీకులకోసం ముడాలో అక్రమాలకు పాల్పడడం సరైనదేనా అని ప్రశ్నించారు. కాంగ్రెస్(Congress)‏ను తామెందుకు బెదిరిస్తామని, వారికి 136 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వ అస్థిరత గురించి ముఖ్యమంత్రి ప్రస్తావించారని, అవినీతిలో కూరుకుపోయి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. పాదయాత్ర సందర్భంగా పార్టీ కార్యకర్త గౌరమ్మ మృతి చెందగా విజయేంద్ర(Vijayendra)తోపాటు పలువురు నాయకులు సంతాపం తెలిపారు.


pandu2.2.jpg

బెంగళూరు జయనగర విభాగం పార్టీ ఉపాధ్యక్షుడు శంకర్‌కు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో రామనగర ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అతడిని కూడా విజయేంద్ర పరామర్శించారు. యడియూరప్ప, కేంద్రమంత్రి కుమారస్వామి, ప్రతిపక్షనేత అశోక్‌, నాయకులు చలవాది నారాయణస్వామి, నిఖిల్‌కుమార్‌, ఎమ్మెల్యే రవి సుబ్రహ్మణ్య, సునిల్‌కుమార్‌, అరవింద బెల్లద, సీకే రామస్వామి, బైరతి బసవరాజ్‌, ప్రభుచౌహాన్‌, మాజీ ఎమ్మెల్యే రేణుకాస్వామి పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: TG News: పీవీఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే పైనుంచి దూకిన గుర్తు తెలియని వ్యక్తి

ఇదికూడా చదవండి: RBI Official: రూ.40 కోట్ల ఆర్థిక మోసం కేసు.. బషీద్‌కు ఆర్‌బీఐ అధికారి సహకారం?

ఇదికూడా చదవండి: KTR: రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు!

Updated Date - Aug 06 , 2024 | 11:16 AM