Naveen Patnaik: నా ఆరోగ్యంపై బీజేపీ దుష్ప్రచారం.. మండిపడిన సీఎం
ABN , Publish Date - May 24 , 2024 | 05:41 PM
భారతీయ జనతా పార్టీపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మండిపడ్డారు. తన ఆరోగ్యంపై బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని, తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని చెప్పారు.
మయూర్‌భంజ్: భారతీయ జనతా పార్టీ (BJP)పై ఒడిశా (Odisha) ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) మండిపడ్డారు. తన ఆరోగ్యంపై బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని, తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా గత నెలరోజులుగా తాను ప్రచారం సాగిస్తున్నట్టు తెలిపారు. "అబద్ధాలు చెప్పడానికైనా ఒక హద్దంటూ బీజేపీకి ఉండాలి. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. అది మీరు చూస్తూనే ఉన్నారు. నెలరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం సాగిస్తూనే ఉన్నాను'' అని మయూర్‌భంజ్‌లో మీడియాతో మాట్లాడుతూ నవీన్ పట్నాయక్ అన్నారు.
Supreme Court: ఎన్నికల మధ్యలో ఈసీని అలా ఆదేశించలేం: సుప్రీంకోర్టు
అసలేం జరిగింది..?
కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఇటీవల ఒడిశాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో 77 ఏళ్ల నవీన్ పట్నాయక్ రిటైర్ కావడం మంచిందంటూ వ్యాఖ్యానించారు. వయసు పైబడటం, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న పట్నాయక్ రిటైరు కావాలని, బీజేపీని గెలిచిపిస్తే ఒడియా మాట్లాడే యువ 'భూమిపుత్రుణ్ణి' ముఖ్యమంత్రిగా చేస్తామని అన్నారు. ఒడిశా రాష్ట్రాన్ని బీజేడీ ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని, ఒడియా ప్రజల గౌరవానికి భంగం కలిగిస్తూ, ఒడిశా సంస్కృతి, ప్రతిష్టను పీకనులుముతోందని ఆరోపించారు. ఒడిశాలో ఎంతో ఖనిజ సంపద, కష్టపడి పనిచేసే యువత ఉన్నప్పటికీ కష్టపడి పనిచేసే ముఖ్యమంత్రి లేడని విమర్శించారు. ఖనిజ సంపదను లూటీ చేసేందుకు నవీన్ బాబు ఏమాత్రం వెనుకాడటం లేదన్నారు. పర్యాటకం పేరుతో ప్రఖ్యాత జగన్నాథ ఆలయం సంస్కృతి, సంప్రదను బీజేపీ ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని, శ్రీక్షేత్రాన్ని కమర్షియల్ సెంటర్‌గా మార్చాలనుకుంటోందని తప్పుపట్టారు. ఈసారి అటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ, లోక్‌సభ ఎన్నికల్లోనూ కమల వికాసం ఖాయమని, ఐదు విడతల లోక్‌సభ ఎన్నికల్లో మోదీ 310 సీట్లు దాటారని, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లోనూ 75కు పైగా సీట్లు గెలుచుకోనున్నామని చెప్పారు.
Read Latest News and National News here