AAP: కేజ్రీవాల్‌ని చంపడానికి బీజేపీ కుట్ర.. సునీతా తీవ్ర ఆరోపణలు
ABN , Publish Date - Apr 21 , 2024 | 07:52 PM
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని(Arvind Kejriwal) తీహార్ జైల్లోనే(Tihar Jail) చంపేందుకు బీజేపీ(BJP) కుట్రపన్నుతోందని ఆయన సతీమణి ఆప్ నేత సునీతా కేజ్రీవాల్(Sunitha Kejriwal) సంచలన ఆరోపణలు చేశారు.
ఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని(Arvind Kejriwal) తీహార్ జైల్లోనే(Tihar Jail) చంపేందుకు బీజేపీ(BJP) కుట్రపన్నుతోందని ఆయన సతీమణి ఆప్ నేత సునీతా కేజ్రీవాల్(Sunitha Kejriwal) సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం జార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగిన ఉలుగులన్ ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.. కేజ్రీవాల్ శరీరంలో షూగర్ స్థాయిలు పెరుగుతున్నాయని.. బీజేపీ ఆయనకు ఇన్సులిన్ ఇవ్వకుండా అడ్డుపడి చంపడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
"బీజేపీ నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష ఇండియా కూటమి పోరాడుతుంది. ఈ పోరాటంలో విజయం సాధిస్తుంది. కేజ్రీవాల్‌కు అధికారదాహం లేదు. దేశానికి మరింత సేవ చేయాలనుకుంటున్నారు. దేశాన్ని నంబర్ 1 స్థానంలో నిలపడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది కష్టమని చాలా మంది అంటున్నారు. 'జైల్ కే తాలే తూటెంగే, అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ చూటేంగే'. జైలు గేట్లు బద్దలుగొట్టి కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ బయటకు వస్తారు. నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడి గెలుస్తాం. ఆయన తినే ప్రతి మెతుకును అధికారులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. కేజ్రీవాల్ 12 ఏళ్లుగా ప్రతిరోజూ 50 యూనిట్ల ఇన్సులిన్ తీసుకుంటున్నారు. కానీ జైలులో ఇన్సులిన్ ఇవ్వడం లేదు. ఢిల్లీ సీఎంను చంపాలనుకుంటున్నారు. కేజ్రీవాల్ ఆలోచనలను వారు అర్థం చేసుకోలేరు. ఆయన చాలా ధైర్యవంతుడు. జైల్లో ఉన్నా దేశం గురించే ఆలోచిస్తుంటారు. ఆయనపై ఈడీ చేస్తున్న ఆరోపణలు రుజువు కాలేదు'' అని ఆమె అన్నారు.
తీహార్ జైలు నివేదిక
కేజ్రీవాల్ ఆరోగ్యానికి సంబంధించి ఆదివారం నాడు తీహార్ జైలు ఓ నివేదిక విడుదల చేసింది. తీహార్ జైలు అధికారులు ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనాకు ఒక నివేదికను సమర్పించారు. అందులో కేజ్రీవాల్ అరెస్టు చేయడానికి కొన్ని నెలల ముందు నుంచి ఇన్సులిన్ తీసుకోవడం ఆపివేసినట్లు, ప్రస్తుతం అతని ఘగర్ లెవల్స్‌లో ఎలాంటి మార్పులు లేవని నివేదికలో తెలిపారు.
కేజ్రీవాల్‌కు ఏ ఇన్సులిన్ అవసరం లేదని దేశ రాజధానిలోని RML హాస్పిటల్ ఇచ్చిన వైద్య రికార్డుల ప్రకారమే ఇన్సులిన్ ఇవ్వట్లేదని జైలు అధికారులు స్పష్టం చేశారు. ఏప్రిల్ 10, 15వ తేదీల్లో ఓరల్ యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ సీఎం ఆరోగ్యాన్ని నిత్యం సమీక్షిస్తున్నారని తీహార్ జైలు ఈ నివేదికలో పేర్కొంది. మనీలాండరింగ్ కేసులో సోరెన్‌ను ఈ ఏడాది జనవరి 31 రాత్రి ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి