Share News

BJP: రాహుల్ గాంధీ ఇంటి వద్ద ఉద్రిక్తత.. క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్

ABN , Publish Date - Sep 11 , 2024 | 06:38 PM

లోక్ సభ విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) అమెరికా పర్యటనలో.. సిక్కులపై చేసిన వ్యా్ఖ్యలను బీజేపీ నేతలు ఖండిస్తున్నారు. రాహుల్ వ్యాఖ్యలు సిక్కు సమాజాన్ని అవమానించే విధంగా ఉన్నాయంటూ ఆ పార్టీ సిక్కు సెల్ సభ్యులు ఆరోపించారు.

BJP: రాహుల్ గాంధీ ఇంటి వద్ద ఉద్రిక్తత.. క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్

ఢిల్లీ: లోక్ సభ విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) అమెరికా పర్యటనలో.. సిక్కులపై చేసిన వ్యా్ఖ్యలను బీజేపీ నేతలు ఖండిస్తున్నారు. రాహుల్ వ్యాఖ్యలు సిక్కు సమాజాన్ని అవమానించే విధంగా ఉన్నాయంటూ ఆ పార్టీ సిక్కు సెల్ సభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలో ఢిల్లీలోని 10 జన్‌పథ్‌లో ఉన్న రాహుల్ గాంధీ ఇంటిని వారు ముట్టడించారు. రాహుల్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించి, నినాదాలు చేశారు.

తొలుత విజ్ఞాన్ భవన్ నుండి ర్యాలీగా బయలుదేరి రాహుల్ నివసిస్తున్న 10 జనపథ్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ వారిని పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులు, పోలీసులకు తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ.. "రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి. విదేశాల్లో ఆయన భారత్ పరువు తీస్తున్నారు. సిక్కుల తలపాగపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు" అని బీజేపీ నేత ఆర్‌పి సింగ్ అన్నారు. దేశంలో 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లకు కాంగ్రెస్సే బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు.


రాహుల్ ఏమన్నారంటే..

ఆర్ఎస్ఎస్ .. కొన్ని రాష్ట్రాలు, మతాలు, భాషలు, వర్గ ప్రజలను తక్కువ అన్న అభిప్రాయంతో చూస్తోందని రాహుల్ ఆరోపించారు. అలాగే భారత్‌లో సిక్కు మతస్థులను తలపాగా పెట్టుకునే అవకాశాన్ని కల్పిస్తారో లేదో అని, సిక్కులకు గురుద్వారా వెళ్లనిస్తారో లేదో అంటూ వ్యాఖ్యానించారు. దేశంలో జరుగుతున్నది రాజకీయ పోరాటం కాదని పేర్కొన్నారు.


దేశద్రోహ వ్యాఖ్యలు..

రాహుల్‌ వ్యాఖ్యలపై కేంద్రమంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాల్లో భారత్‌ ప్రతిష్ఠను మంటగలుపుతున్నారని ధ్వజమెత్తారు. సిక్కులను ఇక్కడ తలపాగాలు ధరించేందుకు అనుమతించరన్న రాహుల్‌ వ్యాఖ్యల్లో నిజం లేదని కేంద్ర మంత్రి హర్దీ్‌ప్ సింగ్‌ పురి అన్నారు. తాను ఆరు దశాబ్దాలుగా తలపాగాను ధరిస్తున్నానని చెప్పారు. 1947 తర్వాత తొలిసారి మోదీ హయాంలోనే సిక్కులు సురక్షితంగా ఉన్నారన్నారు.

రాహుల్‌ గాంధీ కుటుంబం అధికారంలో ఉన్నప్పుడే సిక్కులు అభద్రతతో బతికారని ఆరోపించారు. 1984లో సిక్కులను ఊచకోత కోశారని, 3 వేలమంది ప్రాణాలు బలిగొన్నారని చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో జరిగిన సిక్కుల ఊచకోతను రాహుల్‌ ఎలా మరిచిపోయారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ హయాంలోనే సిక్కుల తలపాగాలను తీసి తనిఖీ చేశారని, ఎందరో సిక్కుల గడ్డాలను కత్తిరించారన్నారు. విదేశాల్లో భారతదేశ ప్రతిష్ఠను దిగజార్చడం దేశద్రోహమేనని కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ విమర్శించారు.

For Latest News and National News click here

Updated Date - Sep 11 , 2024 | 06:39 PM