Lok Sabha polls: సినిమా సూపర్ ఫ్లాప్ షో: తేజస్వీ యాదవ్
ABN , Publish Date - Apr 20 , 2024 | 01:14 PM
లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ వేళ.. బీజేపీ సత్తా ఏమిటో వెల్లడైందని ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ పేర్కొన్నారు. బీజేపీ 400 సీట్లు సినిమా సూపర్ ప్లాఫ్ షో అయిందన్నారు. అయితే తొలి దశలో బిహార్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాల్లో మహాఘట్‌బంధన్ విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
పాట్నా, ఏప్రిల్ 20: లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ వేళ.. బీజేపీ సత్తా ఏమిటో వెల్లడైందని ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ పేర్కొన్నారు. బీజేపీ 400 సీట్లు సినిమా సూపర్ ప్లాఫ్ షో అయిందన్నారు. అయితే తొలి దశలో బిహార్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాల్లో మహాఘట్‌బంధన్ విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
పోలింగ్ అనంతరం బ్లాక్ స్థాయిలోని స్థానిక పార్టీ నేతలతో భేటీ అయ్యాయనని.. వారి నుంచి వివరాలు సేకరించానని తెలిపారు. పోలింగ్ జరిగిన ఆ లోక్‌సభ స్థానాల్లో తమకు మంచి ఫలితాలు వస్తాయన్నారు. బీజేపీకి బిహార్ ప్రజలు మంచి గుణ పాఠం చెబుతారన్నారు. 2014- 2019 మధ్య ప్రధానిగా మోదీ బిహార్ ప్రజలు చాలా హామీలు ఇచ్చారని గుర్తు చేశారు.
Madhya Pradesh: రేప్ చేసి.. బెల్టుతో కొట్టి.. గాయాలపై కారం..
కాని వాటిని ఆయన అమలు చేయలేదని ఆరోపించారు. ఆ పార్టీ నేతల ప్రకటనలు, అమలు కానీ హామీలతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారన్నారు. అయితే తాము గెలిస్తే బిహార్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ప్రకటించారు.
Ayodhya: రామ్ లల్లా భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ సౌకర్యాన్ని పునరుద్ధరించిన ఆలయ ట్రస్ట్..
అలాగే రాష్ట్రంలో నిరుద్యోగం అతి పెద్ద సమస్య అని ఉందన్నారు. దీనితోపాటు ద్రవ్యోల్బణం, పేదరికం, పెట్టుబడులు, వలసలు, వరదలు తదితర అంశాలు రాష్ట్రంలో ఉన్నాయని చెప్పారు. వాటిని నిర్మూలించేందుకు మహాఘటబంధన్, ఇండియా కూటమి కలిసి పని చేస్తాయని ఆయన స్ఫష్టం చేశారు.
దేశంలో రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. అలా చేస్తే... వారే నాశనమైపోతారన్నారు. ఇక తొలి దశలో జుమాయి, నవడా, గయా, ఔరంగాబాద్ లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్‌లో 48.88 శాతం మేర ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
PM Modi: సభ మధ్యలో తల్లి ఫోటో చూసి మోదీ భావోద్వేగం.
బిహార్‌లో మొత్తం 40 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో.. అంటే 2019 ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు జేడీయూ, ఎల్‌జేపీలు కలిసి 39 స్థానాలను కైవసం చేసుకున్నాయి. మహాఘట్‌బంధన్ కేవలం 1 స్థానానికై పరిమితమైంది.
Lok Sabha Elections 2024: మొదటి దశలో 63 శాతం దాటిన ఓటింగ్.. ఈ రాష్ట్రంలోనే ఎక్కువ
అయితే ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో మోదీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి 400 స్థానాలను లక్ష్యంగా చేసుకుని ఎన్నికలు వెళ్తున్న సంగతి తెలిసిందే. తద్వారా మూడోసారి అధికారాన్ని అందుకుంటామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ ఈ విధంగా వ్యాఖ్యానించారు.
జాతీయ వార్తలు కోసం..