Home » Tejashwi Yadav
బీహార్‌లో 58 శాతం మంది 18 నుంచి 25 ఏళ్ల లోపు యువకులేనని, రెక్కలు అలిసిపోయిన రిటైర్డ్ సీఎం ఈ రాష్ట్రానికి అవసరం లేదని పరోక్షంగా నితీష్‌పై తేజస్వి యాదవ్ విమర్శలు గుప్పించారు.
నితీష్ కుమార్ ప్రసంగిస్తుండగా తేజస్వి అడ్డుపడటంతో ఆయన ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. తన వల్లే లాలూ ప్రసాద్ రాష్ట్ర రాజకీయాల్లో ఎదిగారంటూ నితీష్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
తన తండ్రి 100 శాతం ఫిట్‌గా ఉన్నారని, ఆయనకు ఓటు వేయాలని రాష్ట్ర ప్రజలకు నిశాంత్ కుమార్ ఇటీవల చేసిన విజ్ఞప్తిపై తేజస్వి మాట్లాడుతూ, ఆయన తండ్రి కంటే మా తండ్రి (లాలూ ప్రసాద్ యాదవ్) మంచి ఫిట్నెస్తో ఉన్నారని చమత్కరించారు.
నితీష్ కుమార్ మరోసారి కూటమి మారే అవకాశాలపై శనివారంనాడిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో తేజస్విని మీడియా ప్రశ్నించినప్పుడు అలాంటి ఊహాగానాలకు తన వద్ద ఆధారాలేమీ లేవన్నారు.
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి యాదవ్ తాజాగా చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో తన అనుబంధం గురించి ట్వీట్ చేసిన తేజస్వి, అప్పుడు కోహ్లీతో దిగిన ఫొటోను కూడా పంచుకున్నాడు.
విపక్షాలను టార్గెట్ చేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బీహార్‌లో చేసిన "ముజ్రా'' డాన్స్ వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత, బీహార్ మాజీ ముఖమంత్రి తేజస్వి యాదవ్ స్పందించారు. ''ఒక ప్రధానమంత్రి మాట్లాడాల్సిన భాషేనా ఇది?'' అని నిలదీశారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. అన్ని పార్టీల దృష్టి యూపీ, బీహార్‌పైనే ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో మెజార్టీ సీట్లు సాధించడం కోసం ఎన్డీయే, ఇండియా కూటమి ప్రయత్నిస్తున్నాయి. యూపీతో పోలిస్తే బీహార్ రెండు కూటములకు కీలకంగా మారింది.
ఒక్కోసారి పొలిటీషియన్స్ ఎగ్జైట్మెంట్లో ఏదేదో మాట్లాడేస్తుంటారు. ఏదో చెప్పబోయి ఇంకేదో అనేస్తుంటారు. కొన్నిసార్లైతే.. ప్రత్యర్థిని టార్గెట్ చేయబోయి, సొంత పార్టీ నాయకులపైనే విమర్శలు గుప్పిస్తుంటారు. బడా నాయకులు సైతం ఇలా...
దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీల నాయకులు బిజీగా గడుపుతున్నారు. పార్టీలో ముఖ్య నాయకుడు రోజుకు మూడు నుంచి నాలుగు సభల్లో పాల్గొనాల్సి వస్తుండటంతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. తాజాగా బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అరారియాలో ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆరోగ్యం క్షీణించింది. అకస్మాత్తుగా వెన్నునొప్పి రావడంతో నడవడానికి ఇబ్బంది పడ్డారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ విచిత్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గెలుపే లక్ష్యంగా ఎవరికి వారు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఏడు విడతల్లో భాగంగా మొదటి విడత పోలింగ్ ముగిసింది. రెండో విడత పోలింగ్ ఈనెల 26వ తేదీన జరగనుంది. బీహార్‌లోని పూర్నియా లోక్‌సభ స్థానానికి రెండో విడతలో పోలింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గం దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. బీహార్‌లోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇండియా కూటమి, ఎన్డీయే కూటమి అభ్యర్థుల మధ్య ద్విముఖ పోరు నెలకొంది. ఒక పూర్నియా స్థానంలో మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థిగా మాజీ ఎంపీ పప్పు యాదవ్ పోటీ చేస్తుండటంతో త్రిముఖ పోటీ నెలకొంది.