Home » Bhihar
దేశంలో ప్రతి ఏటా పాము కాటు వల్ల 50 వేల మంది మరణిస్తున్నారని బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ వెల్లడించారు. ప్రపంచంలోనే పాము కాటు వల్ల మరణిస్తున్న వారి జాబితాలో భారత్ అగ్రస్థానంలో ఉందన్నారు. సోమవారం లోక్‌సభలో సరణ్ ఎంపీ, బీజేపీ నేత రాజీవ్ ప్రతాప్ రూడీ మాట్లాడుతూ.. భారత్‌లో ప్రతి ఏటా 30 నుంచి 40 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారన్నారు.
బీహార్‌లో ఇండియా కూటమి భాగస్వామ్య వికాశీల్ ఇన్సాన్ పార్టీ (VIP) చీఫ్ ముకేవ్ సహానీ తండ్రి జితన్ సహానీ దారుణ హత్యకు గురయ్యారు. దర్భంగా జిల్లా సుపాల్ బజార్‌లోని సొంత ఇంట్లో జితన్ సహానీని దండుగుల దారుణంగా నరికి చంపేశారు. మంగళవారం ఉదయం మంచంపై ఆయన మృతదేహాన్ని గుర్తించారు.
ఓ వైపు లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. మరోవైపు కన్నతల్లీ మరణించింది. దీంతో పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకుందీ ఆ కుటుంబం. అనంతరం ఆ కుటుంబం తల్లీ అంత్యక్రియల్లో పాల్గొంది. ఈ ఘటన శనివారం అంటే.. జూన్ 1వ తేదీన బిహార్‌లోని జెహనాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోని దేవ్‌కులి గ్రామంలో చోటు చేసుకుంది.
ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ.. దాని మిత్ర పక్షాలు నాలుగు వందలకుపైగా లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు.
లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ వేళ.. బీజేపీ సత్తా ఏమిటో వెల్లడైందని ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ పేర్కొన్నారు. బీజేపీ 400 సీట్లు సినిమా సూపర్ ప్లాఫ్ షో అయిందన్నారు. అయితే తొలి దశలో బిహార్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాల్లో మహాఘట్‌బంధన్ విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేశారు.