Share News

Bomb Threats: 3 ఇంజనీరింగ్ కాలేజీలకు బాంబు బెదిరింపు మెయిల్స్

ABN , Publish Date - Oct 04 , 2024 | 06:37 PM

సమాచారం తెలుసుకున్న పోలీసులు, బాంబు నిర్వీర్వ దళాలు, డాగ్ స్క్వాడ్‌లు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి. ఎక్కడా అనుమానాస్పద వస్తువులు కనిపించడంతో బాంబు బెదిరింపులేనని ఉత్తవేనని తేలింది.

Bomb Threats: 3 ఇంజనీరింగ్ కాలేజీలకు బాంబు బెదిరింపు మెయిల్స్

బెంగళూరు: బాంబులు పెట్టామంటూ బెంగళూరులోని మూడు ఇంజనీరింగ్ కాలేజీలకు ఇ-మెయిల్స్ బెదిరింపులు వచ్చాయి. శుక్రవారం మధ్యాహ్నం ఈ బాంబు బెదిరింపులు రావడంతో కాలేజీ క్యాంపస్‌లలో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు, బాంబు నిర్వీర్వ దళాలు, డాగ్ స్క్వాడ్‌లు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి. ఎక్కడా అనుమానాస్పద వస్తువులు కనిపించడంతో బాంబు బెదిరింపులేనని ఉత్తవేనని తేలింది.

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్.. 14మంది మావోలు హతం..


బసవనగుడిలోని బెంగళూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బీఎంఎస్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్, సదాశివ్‌నగర్‌లోని ఎంఎస్ రామయ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఈ-మెయిల్ బాంబు బెదిరింపులు వచ్చినట్టు పోలీసులు తెలిపారు. క్షుణ్ణంగా తనిఖీలు జరిపిన అనంతరం అవి కేవలం ఉత్తుత్తి బెదిరింపులేనని తేలిందన్నారు. హనుమంత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్టు సౌత్ డివిజన్ డీసీపీ లోకేష్ తెలిపారు.


దీనికి ముందు, అక్టోబర్ 3న తమిళనాడులోని 9 విద్యా సంస్థలకు బాంబు బెదిరింపు ఇ-మెయిల్స్ వచ్చాయి. సెయింట్ జోసెఫ్ కాలేజీ, హోలీ క్రాస్ కాలేజీ, మనప్పరై కాంపియాన్ స్కూల్, సమ్మత్ స్కూల్, ఆర్కాట్ స్కూలు, ఆచార్య స్కూలు, కామన్ స్కూలు, సెయింట్ అన్నే స్కూలు, రాజం పబ్లిక్ స్కూలుకు ఈ బెదిరింపులు వచ్చాయి. పోలీసు గాలింపు చర్యల అనంతరం అజ్ఞాతవ్యక్తుల బెదిరింపు మెయిల్స్ ఉత్తుత్తివేనని తేలాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

Arvind Kejriwal: అధికారిక నివాసం ఖాళీ చేసిన కేజ్రీవాల్.. ఎక్కడికి మారారంటే

Haryana Assembly Elections 2024: కాంగ్రెస్, బీజేపీ మధ్యలో ఆప్.. చివర నిమిషంలో మారిన రాష్ట్ర రాజకీయం

For Latest news and National news click here

Updated Date - Oct 04 , 2024 | 06:41 PM