Share News

LokSabha Elections: ప్రజలను భయపెట్టి గెలిచేందుకు మమత ప్రయత్నం

ABN , Publish Date - Apr 28 , 2024 | 01:15 PM

పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం నిప్పులు చెరిగారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో సందేశ్‌కలీలోని షేక్ షాజహాన్ తరహా సంఘ విద్రోహ శక్తులు ఉన్నారని ఆయన విమర్శించారు.

LokSabha Elections: ప్రజలను భయపెట్టి గెలిచేందుకు మమత ప్రయత్నం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం నిప్పులు చెరిగారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో సందేశ్‌కలీలోని షేక్ షాజహాన్ తరహా సంఘ విద్రోహ శక్తులు ఉన్నారని ఆయన విమర్శించారు.

వారి వల్ల మహిళలకు బెదిరింపులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సందేశ్‌కలీ‌లోని మహిళలు, వారి భూములను రక్షించేందుకు వెళ్లిన దర్యాప్తు సంస్థల సిబ్బందిపై దారుణంగా దాడులు చేశారని ఈ సందర్బంగా జేపీ నడ్డా గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌లో స్థానికులకు రక్షణ కల్పిస్తున్నామన్నారు.

రాష్ట్రంలో మమతా బెనర్జీ ప్రభుత్వం చట్టబద్ద పాలన సాగించడం లేదని అర్థమవుతుందని పేర్కొన్నారు. మమతా బెనర్జీ బలహీన ప్రభుత్వాన్నికి, అటవిక పాలనకు సందేశ్‌కలీ సంఘటన ఓ ఉదాహరణ అని జేపీ నడ్డా వివరించారు.


అయితే సందేశ్‌కలీలో నిర్వహించిన తనిఖీల్లో 3 విదేశీ రివాల్వర్లు, పోలీసులు వినియోగించే రివాల్వర్‌తోపాటు విదేశీ పిస్టల్, తుపాకులు, బుల్లెట్లతోపాటు క్యాటరిడ్జ్‌లు దొరికాయని వివరించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ సంగీతం వినిపించే ఈ బెంగల్‌ గడ్డ మీద బాంబులు, తుపాకుల శబ్దాలు వినిపిస్తున్నాయని చెప్పారు.

నేతాజీ సుభాష్ చంద్రబోస్, రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద, అరబిందో వంటి ప్రముఖులు పట్టిన గడ్డ బెంగాల్ అని ఆయన తెలిపారు. అలాంటి గడ్డ మీద నివసించే ప్రజలను భయపెట్టి, బెదిరించి ఈ ఎన్నికల్లో గెలిచేందుకు మమతా బెనర్జీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు.

ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ఎటువంటి వ్యూహాలు అమలు చేసినా... ప్రజల మాత్రం సరైన రీతిలో బుద్ది చెబుతారన్నారు. అయితే ఈ ఎన్నికల్లో బెంగాల్‌ల్లో 35 లోక్‌సభ స్థానాల్లో తమ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందన్నారు.

Read Latest National News and Telugu News

Updated Date - Apr 28 , 2024 | 01:16 PM