Breaking News: నేటి తాజా వార్తలు..
ABN , First Publish Date - Aug 07 , 2024 | 12:56 PM
Telugu Latest News Live Updates: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. మినిట్ టు మినిట్ తాజా వార్తలను ఇక సులభంగా తెలుసుకోవచ్చు. మీకోసమేు ప్రత్యేకంగా లైవ్ అప్‌డేట్స్ ప్లాట్‌ఫామ్.. సమస్త సమాచారం ఇక్కడే చూసేయండి.
Live News & Update
-
2024-08-07T13:16:26+05:30
జగన్ అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు సీరియస్
జగన్ అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు సీరియస్
సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌లోని అంశాలు షాకింగ్‌గా ఉన్నాయి:
జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ మద్యాహ్నం 2గంటలకు వాయిదా
మాజీ ఎంపీ రఘురామకృష్ణ రాజు గతంలో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం.
సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌లో చెప్పిన అంశాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి
కేసులు ట్రయల్ ప్రారంభం కాకుండా... ఇన్ని కేసులు ఎలా ఫైల్ చేశారని ప్రశ్నించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా.
ఆరుగురు జడ్జిలు మారిపోయారు, రిటైర్ అయ్యారు ... గత పదేళ్లుగా ఇదే పనిలో ఉన్నారని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చిన రఘురామ తరపు న్యాయవాది.
కోర్టులో వచ్చిన ఆదేశాలు తప్పు అని, ఇంకో కోర్టులో ఇచ్చిన ఉత్తర్వులు తప్పు అంటూ కాలయాపన చేస్తున్నారని అసహనం వ్యక్తం చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా.
కోర్టు ఉత్తర్వులు తప్పు అంటూ చేస్తున్న వ్యవహారానికి ట్రయల్‌కి సంబంధం లేదని వ్యాఖ్యానించిన జస్టిస్ ఖన్నా.
డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారని, సాధారణ కార్యకలాపాలకు ఇది అడ్డంకిగా మారుతోందన్న రఘురామ తరపు న్యాయవాది.
సుప్రీంకోర్టులో తాము అనేక పిటిషన్లు విచారించి డిశ్చార్జ్ చేస్తున్నాం.. ఎలాంటి అడ్డంకి తమకు రావడం లేదు అని వ్యాఖ్యానించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా.
సీబీఐ తరపు వాదనలు వినిపించడానికి ఏఎస్‌జి రాజు అందుబాటులో లేరని తెలిపిన ఇతర న్యాయవాదులు.
ఏఎస్‌జి రాజును వెంటనే పిలిపించాలని, మధ్యహ్నాం 2గంటలకు విచారణ చేపడుతామని చెప్పిన ధర్మాసనం.
-
2024-08-07T13:11:36+05:30
అన్న క్యాంటీన్ల ప్రారంభానికి సన్నాహాలు
అమరావతి: ఈ నెల 15వ తేదీన అన్న క్యాంటీన్ల ప్రారంభానికి సన్నాహాలు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లల్లో ఆహారం సరఫరా చేయనున్న హరేకృష్ణ ఛారిటబుల్ ఫౌండేషన్.
203 అన్న క్యాంటీన్లకు ఆహారం సరఫరా
బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ సఫ్లై
అన్న క్యాంటీన్లకు ఆహార సరఫరాకు పిలిచిన టెడర్లలలో ఎల్-1గా నిలిచిన హరేకృష్ణ సంస్థ.
తొలి విడతలో 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్న ప్రభుత్వం.
రెండో విడతలో 83.. మూడో విడతలో 20 అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్న మున్సిపల్ శాఖ.
-
2024-08-07T13:00:10+05:30
ఒలింపిక్స్‌లో చెదిరిన భారత కల
గోల్డ్ మెడల్ కోసం ఆశగా ఎదురుచూసిన క్రీడాభిమానులు
భారత ప్రజలకు నిరాశ
ఫైనల్ చేరిన రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌పై అనర్హత వేటు
50 కేజీల విభాగంలో బరువు పెరిగిన వినేశ్ ఫోగట్
100 గ్రాముల బరువు పెరగడంతో అనర్హత
-
2024-08-07T12:56:31+05:30
ఒలింపిక్స్‌లో భారత కల చెదిరింది. గోల్డ్ మెడల్ కోసం ఆశగా ఎదురుచూసిన యావత్ భారత ప్రజలకు నిరాశ కలిగింది. ఫైనల్ చేరిన రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌పై అనర్హత వేటు పడింది.
-
2024-08-07T01:07:44+05:30
వినేశ్ ఫోగాట్‌పై ప్రధాని మోదీ
వినేశ్ మీరు ఛాంపియన్.. భారత్‌కు గర్వకారణం
భారతీయులందరికీ స్ఫూర్తిగా నిలిచారు.
ఈ రోజు మీకు జరిగిన అనుభవం అందరికి బాధ కలిగించింది.
ఆ ఘటనపై అభిప్రాయం వ్యక్తం చేయడానికి నోట మాట రావడం లేదు.
ఆ బాధ నుంచి బయటపడి మీరు మరింత బలంగా రావాలి.
సవాళ్లను ఎదురించడం మీ నైజం, మీకు మేమంతా అండగా ఉన్నాం