Mayawati: మనసు మార్చుకున్న మాయావతి.. వారసుడు ప్రకటన
ABN , Publish Date - Jun 23 , 2024 | 04:22 PM
దేశంలో సార్వత్రిక ఎన్నికల ముందు బీఎస్పీ అధినేత మాయావతి తన రాజకీయ వారసుడి బాధ్యతల నుంచి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను తొలగించారు. అదేవిధంగా పార్టీలో అన్ని బాధ్యతల నుంచి తప్పించారు. ఎన్నికల తర్వాత మాయావతి తన మనసు మార్చకుని మరోసారి తన రాజకీయ వారసుడిగా ఆకాష్ ఆనంద్ పేరును ప్రకటించారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికల ముందు బీఎస్పీ అధినేత మాయావతి తన రాజకీయ వారసుడి బాధ్యతల నుంచి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను తొలగించారు. అదేవిధంగా పార్టీలో అన్ని బాధ్యతల నుంచి తప్పించారు. ఎన్నికల తర్వాత మాయావతి తన మనసు మార్చకుని మరోసారి తన రాజకీయ వారసుడిగా ఆకాష్ ఆనంద్ పేరును ప్రకటించారు. అలాగే బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్ బాధ్యతలను ఆయనకు అప్పగించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బీఎస్పీ అధినేత మాయావతి పార్టీ కార్యాలయంలో జరిగిన తొలి సమావేశంలో పాల్గొన్నారు. సరిగ్గా 11 గంటలకు మాయావతి సమావేశానికి హాజరయ్యారు. ఆమె తన సోదరుడు, మేనల్లుడితో కలిసి సభావేదికపైకి వచ్చారు. మాయావతి ముందు వరుసలో ఉండగా.. ఆ తర్వాత ఆమె సోదరుడు ఆనంద్ కుమార్, ఆయన కుమారుడు ఆకాష్ ఆనంద్ ఉన్నారు. ఆ తర్వాత ఆకాష్ ఆనంద్ మాయావతి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. బీఎస్పీ అధినేత్రి తన మేనల్లుడి తలపై చేయి వేసి ఆశీర్వదించారు. దీంతో మరోసారి ఆకాష్ ఆనంద్ బీఎస్పీలో కీలకపాత్ర పోషించనున్నట్లు పార్టీ కార్యకర్తలకు అర్థమైంది.
NEET Paper Leakage Protests: మా చివరి ఆశ మీరే.. నీట్ పేపర్ లీకేజీ నిరసనల్లో విద్యార్థుల భారీ నిరసన
ఎన్నికలకు ముందు..
మాయావతి సోదరుడు కుమారుడు ఆకాష్ ఆనంద్‌ను కొన్ని నెలల క్రితం తన రాజకీయ వారసుడిగా ప్రకటించారు. మాయావతి తర్వాత పార్టీలో కీలకమైన నాయకుడిగా ఆకాష్ ఆనంద్ ఉన్నారు. దేశ వ్యాప్తంగా తిరుగుతూ పార్టీ కోసం ప్రచారం చేశారు. అయితే అనూహ్యంగా ఆకాష్ ఆనంద్‌ను పార్టీ బాధ్యతల నుంచి తొలగించి సార్వత్రిక ఎన్నికల ముందు ఆయనను పక్కనపెట్టారు. దీంతో ఆకాష్ ఆనంద్ రాజకీయాలకు దూరంగా ఉంటూ ఇంటికే పరిమితమయ్యారు. కాగా ఎన్నికల్లో బీఎస్పీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. యూపీలో ఒక్క సీటును గెలుచుకోలేకపోయింది. మే7వ తేదీన ఆకాష్ ఆనంద్‌ను బీఎస్పీలో అన్ని బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు మాయావతి తెలిపారు. మళ్లీ జూన్ 23న మరోసారి తన వారసుడిగా ప్రకటించి పార్టీ జాతీయ కోఆర్డినేటర్ బాధ్యతలను అప్పగించారు.
Rahul Gandhi: నిస్సహాయ స్థితిలో మోదీ సర్కార్.. రాహుల్ నిప్పులు
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More National News and Latest Telugu News