Budget 2024: బిహార్‌కు ప్రత్యేక హోదా లేదు కానీ..
ABN , Publish Date - Jul 23 , 2024 | 01:49 PM
హార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన జేడీ(యూ) డిమాండ్ చేస్తుంది. తాజా బడ్జెట్‌లో అలాంటి ప్రతిపాదన లేవి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించ లేదు.
న్యూఢిల్లీ, జులై 23: బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన జేడీ(యూ) డిమాండ్ చేస్తుంది. తాజా బడ్జెట్‌లో అలాంటి ప్రతిపాదన లేవి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించ లేదు. కానీ వారణాసిలోని విశ్వనాథుని ఆలయం తరహాలో బిహార్‌లోని బుద్ద గయాలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బుద్ద గయాలో ఏర్పాటు చేసే ఆలయం వారణాసిలోని ఆలయాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటుందని ఆమె వివరించారు. అలాగే బిహార్‌ను ప్రపంచ పర్యాటక కేంద్రంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
అందులోభాగంగా గయాలోని విష్ణుపాద దేవాలయంతోపాటు బుద్ద గాయాలోని మహాబోధి దేవాలయాన్ని సైతం అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. బిహార్‌లోని ప్రముఖ దేవాలయాలన్నీ అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఆ క్రమంలో రాజ్‌గిర్‌లోని జైన్ దేవాలయానికి సైతం ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు.
అదే విధంగా రాజ్‌గిర్‌లోని బ్రహ్మకుండ్ సైతం అభివృద్ధి పరుస్తామని చెప్పారు. ఇక ఒడిశా రాష్ట్రాభివృద్ధికి చేయుత ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆ రాష్ట్రంలో దేవాలయాలు, వన్యప్రాణ సంరక్షణ కేంద్రాలు, స్మారక కట్టడాలతోపాటు సహాజమైన బీచ్‌లున్నాయన్నారు. వాటిని సైతం అభివృద్ధి పరుస్తామని ఆమె పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. వాటిలో ఒడిశా సైతం ఉంది. ఒడిశా ఓటరు బీజేపీకి పట్టం కట్టాడు. దీంతో మోహన్ చరణ్ మాఝీ ప్రభుత్వం కొలువు తీరింది. దాంతో ఆ రాష్ట్రాభివృద్ధికి పాటు పడతామని అసెంబ్లీ ఎన్నికల ప్రచార వేళ.. ప్రధాని మోదీతోపాటు ఆయన కేబినెట్ మంత్రులు ప్రకటించారు.
అందులోభాగంగా ఆర్థిక మంత్రి నిర్మలమ్మ.. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన వేళ.. ఒడిశా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఇక ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన జేడీ (యూ) అధినేత, బిహార్ సీఎం నితీష్ కుమార్.. తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కేటాయించాలని మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాదు స్వయంగా ప్రధాని మోదీతోపాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి ఆయన పలుమార్లు విజ్జప్తి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ రాష్ట్రాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ ఆర్థిక మంత్రి నిర్మలమ్మ బడ్జెట్ ప్రవేశపెట్టే వేళ ఈ ప్రకటనలు చేశారు.
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News