Budget : గ్రామీణాభివృద్ధికి 2.66 లక్షల కోట్లు
ABN , Publish Date - Jul 24 , 2024 | 05:52 AM
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి కోసం కేంద్రం బడ్జెట్లో రూ.2.66 లక్షల కోట్లు కేటాయించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పీఎం ఆవాస్ యోజన కింద అదనంగా మూడు కోట్ల ఇళ్లు నిర్మించనున్నట్లు ప్రకటించింది.
National News : గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి కోసం కేంద్రం బడ్జెట్లో రూ.2.66 లక్షల కోట్లు కేటాయించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పీఎం ఆవాస్ యోజన కింద అదనంగా మూడు కోట్ల ఇళ్లు నిర్మించనున్నట్లు ప్రకటించింది. గ్రామాల్లో రహదారుల నిర్మాణం కోసం పీఎం గ్రామ సడక్ యోజన నాలుగో దశను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఈ పథకం ద్వారా దాదాపు 25 వేల ఆవాసాలు లబ్ధి పొందుతాయని పేర్కొంది. ఆయా గ్రామాల్లో జనాభా పెరిగినందున అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ రాకపోకలు సాగించేందుకు వీలుగా రహదారులను నిర్మించనున్నట్లు కేంద్ర సర్కారు తెలిపింది.