Delhi: మేము ఎలా పని చేయాలో మీరు చెప్తారా ? ఐఎంఏ అధ్యక్షుడు ఆర్వీ అశోకన్..
ABN , Publish Date - May 01 , 2024 | 05:39 AM
‘పతంజలి’ వాణిజ్య ప్రకటనల కేసు విచారణలో భాగంగా ఐఎంఏ తీరుపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఐఎంఏ అధ్యక్షుడి వ్యాఖ్యలపై సుప్రీం ఆగ్రహం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ‘పతంజలి’ వాణిజ్య ప్రకటనల కేసు విచారణలో భాగంగా ఐఎంఏ తీరుపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఐఎంఏ అధ్యక్షుడు ఆర్వీ అశోకన్ సుప్రీంకోర్టును తప్పుబడుతూ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘‘మేము ఎలా పని చేయాలో మీరు చెబుతారా’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇదే కేసులో ఏప్రిల్ 23న విచారణ సందర్భంగా ప్రైవేటు వైద్యులు రోగులకు ఖరీదైన మందులు సిఫారసు చేయడంపై ఐఎంఏను ప్రస్తావిస్తూ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దీనిపై అశోకన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సుప్రీం వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. పతంజలి తరఫు న్యాయవాది ముఖుల్ రోహిత్గీ మంగళవారం నాటి విచారణలో భాగంగా అశోకన్ వ్యాఖ్యలను ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘విచారణ ప్రక్రియలో మేమెలా వ్యవహరించాలో అసలు మీరు ఎలా చెబుతారు’’ అని ప్రశ్నించింది. అశోకన్ ఇంటర్వ్యూ వీడియోలను సమర్పించాలని రోహిత్గీని ఆదేశించింది.