Home » Patanjali Ayurved
‘కరోనిల్’ వాడకానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో పెట్టిన తప్పుడు పోస్టులను తొలగించాలని పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకుడు, యోగా గురువు రామ్‌దేవ్‌ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.
ఉత్తరాఖండ్‌లోని పితోర్ఘర్లో నాణ్యత లేని సోం పాపిడి విక్రయిస్తున్నందుకు పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ సంస్థ అసిస్టెంట్ మేనేజర్ సహా మరో ఇద్దరికి పితోర్‌ఘర్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ శనివారం ఆరు నెలల జైలు శిక్షతోపాటు జరిమానా విధించారు.
ఉపాధ్యాయుల భర్తీ కుంభకోణంపై సుప్రీంకోర్టు మంగళవారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించింది. ఇలాంటి మోసాలు జరిగితే ప్రజలు వ్యవస్థలపై విశ్వాసాన్ని కోల్పోతారని వ్యాఖ్యానించింది.
‘పతంజలి’ వాణిజ్య ప్రకటనల కేసు విచారణలో భాగంగా ఐఎంఏ తీరుపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
పతంజలికి మరో షాక్ తగిలింది. పతంజలికి చెందిన 14 ఉత్పత్తులపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పతంజలి ఉత్పత్తులకు సంబంధించి తప్పుదారి ప్రకటించే కేసు విషయంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలియజేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయనందుకు క్షమాపణలు చెబుతూ పంతజలి సంస్థ మళ్లీ పత్రికల్లో ప్రముఖంగా ప్రకటనలు ఇచ్చింది.
కరోనాపై పోరాడేందుకు పతంజలి తయారు చేసిన ఆయుర్వేద ఔషధం కరోనిల్‌ను ఔషధంగా ప్రచారం చేయడాన్ని సుప్రీంకోర్టు(Supreme Court) మంగళవారం మరోసారి తప్పుబట్టింది. ఈ విషయంలో పతంజలి ఆయుర్వేదం, బాబా రామ్‌దేవ్‌లు(Baba Ramdev) బహిరంగ క్షమాపణలు చెప్పాలని కోర్టు ఆదేశించింది. అంతకుముందు బాబా రామ్‌దేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణ కోర్టులో చేతులు జోడించి క్షమాపణలు చెప్పారు.
సుప్రీంకోర్టులో యోగా గురువు రాందేవ్ బాబాకు చుక్కెదురైంది. రాందేవ్ బాబాకు చెందిన పతంపలి యోగ్ పీఠ్ ట్రస్ట్ రూ.4.5 కోట్లు చెల్లించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జస్టిస్ అభయ్ ఎస్ ఒకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని ధర్మాసనం అలహాబాద్ కస్టమ్స్ ఎక్సైజ్ సర్వీస్ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది.