Share News

Cancellation of trains: తిరుపతి వెళ్లే మెమో రైళ్లు పాక్షిక రద్దు.. కారణం ఏంటంటే..

ABN , Publish Date - Mar 17 , 2024 | 12:45 PM

స్థానిక మూర్‌ మార్కెట్‌ కాంప్లెక్‌, విల్లుపురం, అరక్కోణం నుంచి తిరుపతి(Arakkonam to Tirupati) వెళ్లే మెమో సబర్బన్‌ రైళ్లు ఆది, సోమవారాలు (ఈనెల 17, 18 తేదీలు) పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే తెలిపింది.

Cancellation of trains: తిరుపతి వెళ్లే మెమో రైళ్లు పాక్షిక రద్దు.. కారణం ఏంటంటే..

చెన్నై: స్థానిక మూర్‌ మార్కెట్‌ కాంప్లెక్‌, విల్లుపురం, అరక్కోణం నుంచి తిరుపతి(Arakkonam to Tirupati) వెళ్లే మెమో సబర్బన్‌ రైళ్లు ఆది, సోమవారాలు (ఈనెల 17, 18 తేదీలు) పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే తెలిపింది.

- నెం.06727 మూర్‌ మార్కెట్‌ కాంప్లెక్స్‌ నుంచి ఉదయం 9.50 గంటలకు బయల్దేరే మెమో ఎక్స్‌ప్రెస్‌ తిరుపతికి బదులుగా రేణిగుంట వరకు మాత్రమే నడుస్తుంది. అలాగే, నెం.06728 తిరుపతి నుంచి మధ్యాహ్నం 1.35 గంటలకు మూర్‌ మార్కెట్‌ కాంప్లెక్స్‌కు బయల్దేరే మెమో ఎక్స్‌ప్రెస్‌ తిరుపతికి బదులుగా రేణిగుంట(Renigunta) నుంచి బయల్దేరుతుంది.

- నెం.16854 విల్లుపురం నుంచి ఉదయం 5.35 గంటలకు తిరుపతికి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైలు తిరుపతికి బదులుగా కాట్పాడి వరకు మాత్రమే నడుస్తుంది. అలాగే, నెం.16853 తిరుపతి నుంచి మధ్యాహ్నం 1.40 గంటలకు విల్లుపురం బయల్దేరే ఎక్స్‌ప్రెస్‌ రైలు తిరుపతికి బదులుగా కాట్పాడి నుంచి బయల్దేరుతుంది.

- నెం.06753 అరక్కోణం నుంచి ఉదయం 9.15 గంటలకు తిరుపతికి బయల్దేరే మెమో ఎక్స్‌ప్రెస్‌ తిరుపతికి బదులుగా రేణిగుంట వరకు మాత్రమే నడుస్తుంది. అలాగే, నెం.06754 తిరుపతి నుంచి మధ్యాహ్నం 3.45 గంటలకు అరక్కోణం బయల్దేరే మెమో ఎక్స్‌ప్రెస్‌ రైలు తిరుపతికి బదులుగా రేణిగుంట నుంచి బయల్దేరుతుందని అధికారులు తెలిపారు.

Updated Date - Mar 17 , 2024 | 12:46 PM