UttarPradesh: రైల్వే ట్రాక్‌పై కదలుతున్న కారు.. లోకో పైలట్ ఏం చేశాడంటే..?
ABN , Publish Date - Oct 06 , 2024 | 05:05 PM
దేశవ్యాప్తంగా ఇటీవల వివిధ ప్రాంతాల్లో రైలు ప్రమాదాలు భారీగా చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలు నివారించేందుకు రైల్వే బోర్డు తీవ్రంగా కసరత్తు చేస్తుంది. మరోవైపు రైల్వే ట్రాక్‌లపై గ్యాస్ బండలు, సిమెంట్ దిమ్మలు, ఐరన్ రాడ్లు వేస్తూ.. కొన్ని అసాంఘిక శక్తులు రైలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
దేశవ్యాప్తంగా ఇటీవల వివిధ ప్రాంతాల్లో రైలు ప్రమాదాలు భారీగా చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలు నివారించేందుకు రైల్వే బోర్డు తీవ్రంగా కసరత్తు చేస్తుంది. మరోవైపు రైల్వే ట్రాక్‌లపై గ్యాస్ బండలు, సిమెంట్ దిమ్మలు, ఐరన్ రాడ్లు వేస్తూ.. కొన్ని అసాంఘిక శక్తులు రైలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. దీంతో సిబ్బందిని రైల్వే బోర్డు అప్రమత్తం చేసింది. అలాంటి వేళ ఉత్తరప్రదేశ్‌లోని గొండ- లక్నో రైల్వే సెక్షన్ పరిధిలో రైల్వే ట్రాక్‌పై కారు కదులుతుంది.
Also Read: Canada: వెయిటర్ ఉద్యోగాల కోసం పోటెత్తిన భారతీయ విద్యార్థులు.. వీడియో వైరల్..!
అదే సమయంలో గోరఖ్‌పూర్ నుంచి లక్నో వెళ్లే ఇంటర్ సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు అదే ట్రాక్‌పైకి వేగంగా దూసుకు వస్తుంది. అయితే ట్రాక్‌పై కారు వెళ్తున్న దృశ్యాన్ని రైలులోని లోకో పైలట్ గమనించాడు. అంతే అత్యవసర బ్రేకులు వేసి ఆ రైలును నిలిపివేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లు అయింది. ఈ ఘటనపై రైల్వే అధికారులకు లోకో పైలట్ సమాచారం అందించాడు. వారు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు.
Also Read: Dasara 2024: ఐదో రోజు.. ఈ అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్న దుర్గమ్మ
కారు రైలు పట్టాలపైకి ఎలా వచ్చిందనే అంశంపై వారు దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా కారు డ్రైవర్‌ను రైల్వే అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ క్రమంలో కారు లక్నో నుంచి వస్తోందని, రైల్వే క్రాసింగ్ వద్దకు రాగానే ఇన్‌కమింగ్ ట్రైన్ కోసం గేట్లు మూసివేశారని డ్రైవర్ గమనించారు. గేట్లు మళ్లీ తెరుచుకునే వరకు వేచి ఉండకుండా ఉండటానికి, డ్రైవర్ ట్రాక్‌లను దాటాలనే ఉద్దేశ్యంతో కారును వేగంగా నడుపుతూ.. ముందుకు వెళ్లినట్లు రైల్వే అధికారుల దర్యాపుతో డ్రైవర్ వెల్లడించారు.
ఈ నేపథ్యంలో కారు డ్రైవర్ అజయ్ సింగ్‌పై రైల్వే అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీని వెనుక ఏమైనా కుట్ర దాగి ఉందా? అనే కోణంలో రైల్వే అధికారులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఈ ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ ట్రాక్‌పై నడిచే అన్ని రైళ్లను కొద్ది సేపు నిలిపి వేశారు. అనంతరం కారును భారీ క్రేన్ల సహయంతో రైల్వే ట్రాక్‌పై నుంచి తొలగించారు. ఆ తర్వాత సదరు ట్రాక్‌పై రైల్వే సర్వీసులను పునరుద్దరించారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో పలు రైలు ప్రమాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
For National News And Telugu News..