Share News

NIA: యువతను జిహాద్‌కు సిద్ధం చేస్తున్న సంస్థపై కేసు..11 చోట్ల ఎన్ఐఏ దాడులు

ABN , Publish Date - Sep 24 , 2024 | 12:48 PM

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో నిషేధించబడిన హిజ్బ్ ఉత్ తహ్రీర్ సంస్థపై జాతీయ దర్యాప్తు సంస్థ కీలక చర్యలు తీసుకుంది. ఈ సంస్థపై ఇప్పటికే కేసు నమోదు చేయగా, ఈ సంస్థకు చెందిన 11 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు నిర్వహిస్తోంది.

NIA: యువతను జిహాద్‌కు సిద్ధం చేస్తున్న సంస్థపై కేసు..11 చోట్ల ఎన్ఐఏ దాడులు
case Hizb ut Tahrir NIA raids

భారతదేశంలో ఇస్లామిక్ పాలనకు కుట్ర పన్నుతున్న హిజ్బ్ ఉత్-తహ్రీర్ (HuT) అనే ఛాందసవాద సంస్థపై NIA చర్యలు తీసుకుంది. ఈ సంస్థ ప్రపంచంలోని అనేక దేశాల్లో నిషేధించబడింది. ఈ సంస్థ ప్రస్తుతం ఇండియాలో యువత బ్రెయిన్ వాష్ చేసి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేలా చేస్తుంది. ఈ అంశంపై చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఈ సంస్థపై కేసు నమోదు చేసింది. ఇప్పుడు ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించారు. దీంతో రంగంలోకి దిగిన ఎన్ఐఏ తమిళనాడు(tamilnadu)లోని 11 చోట్ల దాడులు నిర్వహిస్తోంది.


హిజ్బ్ ఉత్ తహ్రీర్ అంటే ఏంటి

హిజ్బ్ ఉత్ తహ్రీర్ అనే సంస్థ ఆవేశపూరిత ప్రసంగాలు చేస్తూ యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంది. అంతేకాదు యువతను జిహాద్‌కు సిద్ధం చేయడమే కాకుండా వారికి ఆయుధ శిక్షణ కూడా ఇస్తుంది. రాడికల్ టెర్రరిస్టు సంస్థ కూడా జీవ ఆయుధాల తయారీలో ట్రైనింగ్ ఇస్తున్నారు. దీంతోపాటు ఈ సంస్థ మత మార్పిడిలను ప్రోత్సహిస్తుంది. ఆ విధంగా లవ్ జిహాద్ ఘటనల్లోనూ వీరి హస్తం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.


తండ్రీకొడుకులు

చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ప్రకారం రాయపేటకు చెందిన తండ్రీకొడుకులు, వారి సహచరుల ప్రకారం హిజ్బ్-ఉత్-తహ్రీర్‌లో చేరడానికి సిద్ధమైనట్లు వెలుగులోకి వచ్చింది. ఉగ్రవాదానికి సంబంధించిన కేసును క్రైం బ్రాంచ్ ఎన్ఐఏకు అప్పగించింది. దీంతో గతంలో ఇదే కేసులో అరెస్టయిన కొందరు నిందితులను కూడా ప్రస్తుతం విచారిస్తున్నారు. విచారణలో కొంత సమాచారం అందుకున్న తర్వాత వెంటనే పుదుక్కోట్టై, కన్యాకుమారి, తాంబరంతో సహా 11 ప్రదేశాలలో NIA చర్యలు ప్రారంభించింది.


లండన్ కేంద్రంగా

ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్‌లో హిజ్బుత్ తహ్రీర్‌తో సంబంధం ఉన్న 16 మందిని అరెస్టు చేశారు. వీరిలో సగం మంది మతం మారిన తర్వాత ముస్లింలుగా మారినవారే. ఈ ఛాందసవాద సంస్థ లక్ష్యం ఇస్లామిక్ దేశాన్ని సృష్టించడం. అల్లాను నమ్మని వ్యవస్థను రద్దు చేయాలని ఒక వెబ్‌సైట్ కూడా ఉంది. ఈ సంస్థ 1952లో జెరూసలెంలో స్థాపించబడింది. దీని ప్రస్తుత ప్రధాన కార్యాలయం లండన్‌లో ఉండటం విశేషం. దీని నెట్‌వర్క్ యూరప్, దక్షిణాసియాలో ఉంది. నివేదికల ప్రకారం ఈ సంస్థ మూలాలు ఇండోనేషియాలో కూడా ఉన్నాయి. ఇస్లామిక్ దేశాన్ని సృష్టించడమే ఈ సంస్థ లక్ష్యం.


ఇవి కూడా చదవండి:

Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం..

Customers: జియో, ఎయిర్ టెల్, వీఐలకు షాకిచ్చిన కస్టమర్లు.. బీఎస్ఎన్ఎల్‌కు లాభం

Money Saving Tips: రోజు కేవలం రూ. 100 ఆదా చేయడంతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే

Read More National News and Latest Telugu News

Updated Date - Sep 24 , 2024 | 12:52 PM