Share News

CBCID: మాజీ మంత్రి అనుచరుడి ఇంట్లో సీబీసీఐడీ సోదాలు..

ABN , Publish Date - Jul 12 , 2024 | 11:19 AM

కరూర్‌ జిల్లా వాంగల్‌ కుప్పిచ్చిపాళయం ప్రాంతానికి చెందిన ప్రకాష్‏కు సంబంధించిన రూ.100 కోట్ల విలువ చేసే భూమిని నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమించుకున్నారన్న ఆరోపణలతో అన్నాడీఎంకే సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఎంఆర్‌ విజయభాస్కర్‌(Former minister MR Vijayabhaskar) అనుచరుడి ఇంటిలో సీబీసీఐడీ(CBCID) ఆకస్మిక తనిఖీలు చేసింది.

CBCID: మాజీ మంత్రి అనుచరుడి ఇంట్లో సీబీసీఐడీ సోదాలు..

చెన్నై: కరూర్‌ జిల్లా వాంగల్‌ కుప్పిచ్చిపాళయం ప్రాంతానికి చెందిన ప్రకాష్‏కు సంబంధించిన రూ.100 కోట్ల విలువ చేసే భూమిని నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమించుకున్నారన్న ఆరోపణలతో అన్నాడీఎంకే సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఎంఆర్‌ విజయభాస్కర్‌(Former minister MR Vijayabhaskar) అనుచరుడి ఇంటిలో సీబీసీఐడీ(CBCID) ఆకస్మిక తనిఖీలు చేసింది. గత నెల 14వ తేదీన బాధితుడు ఫిర్యాదు చేయగా, ఇదే అంశంపై సబ్‌ రిజిస్ట్రార్‌ కూడా మరో ఫిర్యాదు ఇచ్చారు. ఇందులో సబ్‌ రిజిస్ట్రార్‌ ఫిర్యాదు ప్రకారం పోలీసులు... యువరాజ్‌, ప్రవీణ్‌, రఘు, సిద్ధార్థన్‌, మారప్పన్‌, సెల్వరాజ్‌, స్థల యజమాని ప్రకాష్‌ కుమార్తె శోభనలపై మొత్తం ఎనిమిది సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అదేవిధంగా స్థల యజమాని ప్రకాష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు... మాజీ మంత్రి ఎంఆర్‌ విజయభాస్కర్‌, ఆయన సోదరుడు శేఖర్‌, ప్రవీణ్‌ సహా ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఇదిలావుంటే, ఈ కేసు విచారణను గత నెల 14వ తేదీన ప్రభుత్వం సీబీసీఐడీకి బదిలీ చేసింది. దీంతో ఎంఆర్‌ విజయభాస్కర్‌ నెల రోజులుగా అఙ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆయన ఆచూకీ కోసం ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

ఇదికూడా చదవండి: Arvind Kejriwal: సుప్రీంలో కేజ్రీవాల్‌కు బెయిల్


ఈ నేపథ్యంలో ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ గత 12న ఆయన కరూర్‌ జిల్లా చీఫ్‌ జ్యూడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో పిటిషన్‌ వేయగా, దానిపై విచారణ జరిపిన కోర్టు అదే నెల 25వ తేదీన తోసిపుచ్చింది. ఆ తర్వాత తన తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆయనకు వైద్యం చేయించేందుకు వీలుగా ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలంటూ జిల్లా ప్రిన్సిపల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ కూడా జూలై ఒకటో తేదీన తిరస్కరణకు గురైంది. ఈ నేపథ్యంలో కరూర్‌లో ఉన్న మాజీ మంత్రి విజయభాస్కర్‌ ప్రధాన అనుచరుడు, అన్నాడీఎంకే ఐటీ విభాగం జిల్లా నిర్వాహకుడు కవిన్‌ నివాసంలో తిరుచ్చి సీబీసీఐడీ పోలీసులు గురువారం ఉదయం 7.30 గంటల నుంచి సోదాలు చేపట్టారు. ఆ సమయంలో కవిన్‌ కుటుంబ సభ్యులు మాత్రమే ఇంటిలో ఉన్నారు. ఈ సందర్భంగా పోలీసులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

ఇదికూడా చదవండి: Bengaluru : కర్ణాటకలో ‘ముడా’ స్కాం కలకలం


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 12 , 2024 | 11:19 AM