Share News

Jamili Elections: కేబినేట్ భేటి ముందుకు జమిలి ఎన్నికల బిల్లు

ABN , Publish Date - Dec 10 , 2024 | 12:49 PM

2027లో దేశంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలతోపాటు లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ వేగంగా పావులు కదుపుతోంది. జమిలి ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే బిల్లు రూపొందినట్లు బీజేపీ వర్గాల పేర్కొంటున్నాయి.

Jamili Elections: కేబినేట్ భేటి ముందుకు జమిలి ఎన్నికల బిల్లు

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర కేబినెట్ బుధవారం న్యూఢిల్లీలో సమావేశం కానుంది. ఈ సందర్భంగా ఈ సమావేశం ముందుకు జమిలి ఎన్నికల బిల్లు రానుంది. అయితే జమిలి ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ కృత నిశ్చయంతో ఉన్నారు. అందుకోసం రానున్న సాధారణ ఎన్నికలు.. జమిలిగానే జరపాలని ప్రధాని మోదీ వ్యూహాత్మంగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి ఎన్నికలపై ఇప్పటికే ప్రధాని మోదీ కార్యచరణ ప్రారంభించారని ఎన్డీఏలోని కీలక భాగస్వామి, టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Also Read: మమతకు మద్దతు తెలిపిన మాజీ సీఎం


ఒకే దేశం.. ఒకే ఎన్నికకు సంబంధించిన ముసాయిదా బిల్లును కేంద్ర న్యాయ శాఖ రూపకల్పన చేసే పనిలో నిమగ్నమైందని తెలుస్తుంది. ఇక ఈ బిల్లు బుధవారం జరిగే కేంద్ర కేబినెట్ సమావేశం ముందుకు వస్తుందని భావిస్తు్న్నారు. అలా కాకుంటే.. వచ్చే బుధవారం కేబినెట్ సమావేశానికి ముందు సంబంధిత ముసాయిదా బిల్లు వస్తుందని ఉన్నతాధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. కేంద్ర కేబినెట్ ఆమోదం అనంతరం పార్లమెంటు ముందుకు ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లు రానుంది. మరోవైపు ఒకే దేశం ఒకే ఎన్నికకు మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఇచ్చిన నివేదికకు గతంలోనే కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిన విషయం విధితమే. కోవింద్ అందించిన నివేదిక ఆధారంగా.. అందుకు సంబంధించిన బిల్లు రూపొందుతోంది.

Also Read: బస్సు బీభత్సం.. ఏడుగురు మృతి


ఇంకోవైపు.. ఈ జమిలి బిల్లుపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షిస్తున్నారు. ఈ బిల్లుకు ప్రజల నుండి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందని బీజేపీ అగ్రనాయకత్వం అంచనా వేస్తోంది. అయితే పార్లమెంటులో రాజ్యాంగ సవరణలకు కూటమికి అవసరమైన సంఖ్యా బలం లేదు. అయినా ఈ బిల్లు ఆమోదించుకోనేందుకు ముందుకెళ్లాలని మోదీ భావిస్తున్నారు. ఇక ఈ జమిలి ఎన్నికలకు మొత్తం 47 పార్టీల్లో 32 పార్టీలు జై కొట్టిన సంగతి తెలిసిందే. అంటే 13 రాజకీయ పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించాయి.

Also Read: మొబైల్, ఇంటర్నెట్ సేవలపై నిషేధం ఎత్తివేత


దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికలు ఒకే సారి నిర్వహించాలని.. అందుకోసం ఒకే దేశం.. ఒకే ఎన్నికను తీసుకు రావాలని బీజేపీ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. ఆ క్రమంలో భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కొన్ని నెలల పాటు చర్చలు, సూచనలు, సలహాలు తీసుకుని ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ నేపథ్యంలోనే ఈ జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టి.. ఆమోదం కల్పించాలని మోదీ సర్కార్ యోచిస్తోంది.

Also Read: కర్ణాటక మాజీ సీఎం ఎస్ ఎం కృష్ణ కన్నుమూత


ఇక 2027లో దేశంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలతోపాటు లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ వేగంగా పావులు కదుపుతోంది. జమిలి ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే బిల్లు రూపొందినట్లు బీజేపీ వర్గాల పేర్కొంటున్నాయి. ఈ బిల్లును ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్ట అవకాశం ఉందని సమాచారం. ఆ తర్వాత ఈ జమిలి ఎన్నికల బిల్లును జాయింట్‌ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సమావేశాల్లో వీలు కాని పక్షంలో వచ్చే సమావేశాల్లో అయినా.. దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని బీజేపీ వర్గాల స్పష్టం చేస్తున్నాయి.

For National News And Telugu News

Updated Date - Dec 10 , 2024 | 12:49 PM