Share News

Central Government : నగరాల సమీపంలో కూరగాయల సాగు!

ABN , Publish Date - Aug 17 , 2024 | 04:11 AM

కురగాయల ధరలు అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకాన్ని ముందుకు తీసుకురానుంది. పట్టణాలు, నగరాలకు సమీపంలో కురగాయల సాగును ప్రోత్సహించాలని నిర్ణయించింది.

 Central Government : నగరాల సమీపంలో కూరగాయల సాగు!

  • రూ.2 వేల కోట్లతో 50 క్లస్టర్ల ఏర్పాటుకు ప్రణాళికలు

న్యూఢిల్లీ, ఆగస్టు 16: కురగాయల ధరలు అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకాన్ని ముందుకు తీసుకురానుంది. పట్టణాలు, నగరాలకు సమీపంలో కురగాయల సాగును ప్రోత్సహించాలని నిర్ణయించింది.

వచ్చే ఐదేళ్లలో, 20 లక్షల జనాభా కలిగిన పట్టణాలు, నగరాలకు సమీపంలో 50 వెజిటబుల్‌ క్లస్టర్లు ఏర్పాటుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది.

ప్రభుత్వ ప్రయివేట్‌ భాగస్వామ్యంతో కురగాయల సాగు, సరఫరాను చేపట్టే ఈ కార్యక్రమం కోసం రూ.2 వేల కోట్లను వెచ్చించే అవకాశం ఉంది. ఈ పథకం కింద కురగాయలు, పండ్ల సేకరణ, నిల్వ చేయడం వంటి వాటి కోసం ఏజెన్సీలను ఎంపిక చేసి వాటికి ఆర్థిక మద్దతునిస్తారు. ఈ ప్రతిపాదనలను త్వరలోనే కేంద్ర కేబినెట్‌ ఆమోదానికి పెట్టే అవకాశం ఉంది.

Updated Date - Aug 17 , 2024 | 04:11 AM