Share News

Prajwal Revanna case: ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్‌పోర్డ్ రద్దు దిశగా చర్యలు..?

ABN , Publish Date - May 23 , 2024 | 11:49 AM

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దౌత్యపరమైన పాస్‌పోర్ట్‌ రద్దుకు సంబంధించి కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రజల్వ్ రేవణ్ణ పాస్‌పోర్ట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే.

Prajwal Revanna case: ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్‌పోర్డ్ రద్దు దిశగా చర్యలు..?
Prajwal Revanna

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దౌత్యపరమైన పాస్‌పోర్ట్‌ రద్దుకు సంబంధించి కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రజల్వ్ రేవణ్ణ పాస్‌పోర్ట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. పాస్‌పోర్టు రద్దుతో పాటు ప్రజల్వ్‌ రేవణ్ణను భారత్‌కు తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సిద్ధరామయ్య తన లేఖలో కోరారు. కర్ణాటక సీఎం రాసిన లేఖపై కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రజ్వల్ రేవణ్ణ అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం దేశం విడిచి వెళ్లిపోయిన అతడిపై రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Mallikarjuna Kharge : అయోధ్యపై బుల్డోజర్‌ అబద్ధం


జర్మనీకి ప్రజ్వల్..

ప్రజ్వల్ రేవణ్ణ తన దౌత్యపరమైన పాస్‌పోర్ట్‌ను ఉపయోగించి ఏప్రిల్ 27న దేశం విడిచి జర్మనీకి వెళ్లిపోయారు. ప్రజల్వ్ రేవణ్ణపై అత్యాచార, లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తర్వాత.. అతడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి కొన్ని గంటల ముందు దేశం విడిచి వెళ్లిపోయినట్లు సీఎం సిద్ధరామయ్య తన లేఖలో పేర్కొన్నారు. లైంగిక వేధింపుల కేసు విచారణలో భాగంగా ప్రజల్వ్‌ రేవణ్ణను స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సిద్ధరామయ్య కోరారు.


కర్ణాటక హోమంత్రి ప్రకటనతో..

మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్‌ నేతపై అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసిన నేపథ్యంలో ప్రజ్వల్‌ రేవణ్ణ దౌత్య పాస్‌పోర్టును రద్దు చేయాలన్న కర్ణాటక ప్రభుత్వ అభ్యర్థనపై కేంద్రం స్పందించలేదని ఆ రాష్ట్ర హోంమంత్రి జి. పరమేశ్వర తెలిపారు. లైంగిక వేధింపులకు సంబంధించిన కేసు విచారణలో ఎలాంటి అలసత్వం లేదని, విచారణలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి లోపం లేదని పరమేశ్వర పేర్కొన్నారు. ఈ కేసును సిట్ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోందని తెలిపారు. మరోవైపు జేడీఎస్ నాయకుడు హెచ్‌డి కుమారస్వామి కూడా ప్రజల్వ్ రేవణ్ణ కర్ణాటకకు వచ్చి విచారణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కర్ణాటక ప్రభుత్వం రాసిన లేఖపై కేంద్రం చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రజల్వ్ రేవణ్ణ పాస్ట్‌పోర్ట్‌ రద్దయితే రెడ్‌ కార్నర్ నోటీసు జారీచేసి ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


పాక్‌కు.. రాహుల్‌, అఖిలేశ్‌ జై

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest National News and Telugu News

Updated Date - May 23 , 2024 | 04:05 PM