Share News

Election Commission : లోక్‌సభ బరిలో 8,360 మంది

ABN , Publish Date - May 23 , 2024 | 05:52 AM

లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 8,360 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. 1996లో జరిగిన సార్వత్రిక

Election Commission : లోక్‌సభ బరిలో 8,360 మంది

1996 తర్వాత ఇదే అత్యధికం: ఎన్నికల సంఘం

న్యూఢిల్లీ, మే 22 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 8,360 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. 1996లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అత్యధికంగా 13,952 మంది పోటీ చేశారని, అభ్యర్థుల సంఖ్య పరంగా ఈ లోక్‌సభ ఎన్నికలు రెండో స్థానంలో నిలిచాయని తెలిపింది. ఈసారి పోటీ చేసినవారిలో మహిళలు 797మంది ఉన్నారని, మొత్తం అభ్యర్థుల్లో మహిళలు 9.5శాతమని పేర్కొంది. మరోవైపు, 8,360 మందిలో 8,337మంది అఫిడవిట్లను అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రాటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) సంస్థ విశ్లేషించింది. తొలి ఆరు దశల్లో బరిలో ఉన్నవారిపైన కేసులు, వారి ఆస్తుల వివరాలను ఇప్పటికే వెల్లడించిన ఏడీఆర్‌.. బుధవారం ఏడో దశలోని అభ్యర్థుల అఫిడవిట్లపై విశ్లేషణను వెల్లడించింది. ఏడో దశలో 904మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిపింది. వీరిలో 95మంది(11ు) మహిళలు. ఏడీఆర్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ దశలో బరిలో ఉన్నవారిలో 199మందిపై క్రిమినల్‌ కేసులున్నాయి. 299 మంది కోటీశ్వరులున్నారు. ఏడో ఈ దశలో దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 స్థానాలకు.. బిహార్‌(8), హిమచల్‌ప్రదేశ్‌(4), ఝార్ఖండ్‌(3), ఒడిశా(6), పంజాబ్‌(13), యూపీ(13), పశ్చిమ బెంగాల్‌(9), చంఢీగడ్‌(1) పోలింగ్‌ జరగనుంది.

Updated Date - May 23 , 2024 | 05:52 AM