Modi Govt: ‘జూన్ 25’ సంవిధాన్ హత్య దినోత్సవంగా ప్రకటించిన కేంద్రం
ABN , Publish Date - Jul 12 , 2024 | 05:12 PM
భారత ప్రధానిగా ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించి.. వచ్చే ఏడాదికి 50 ఏళ్లు పూర్తి చేసుకొనుంది. అలాంటి వేళ.. మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై జూన్ 25వ తేదీని సంవిధాన్ హత్య దినోత్సవంగా జరపాలని నిర్ణయించింది.
న్యూఢిల్లీ, జులై 12: భారత ప్రధానిగా ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించి.. వచ్చే ఏడాదికి 50 ఏళ్లు పూర్తి చేసుకొనుంది. అలాంటి వేళ.. మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై జూన్ 25వ తేదీని సంవిధాన్ హత్య దినోత్సవంగా జరపాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా ప్రకటించారు. 1975, జున్ 25వ తేదీన ప్రధాని ఇందిరాగాంధీ, తన విపరీతమైన నియంతృత్వ మనస్తత్వ ధోరణితో దేశంలో ఎమర్జెన్సీ విధించిందన్నారు. తద్వారా భారతదేశం యొక్క ఆత్మ గొంతు నులిమినట్లయిందని ఆయన అభివర్ణించారు. ఏ తప్పు చేయకుండా లక్షలది మంది ప్రజలు కటకటాలపాలయ్యారని గుర్తు చేశారు. మీడియా గొంతు సైతం నొక్కేశారన్నారు. దీంతో ప్రతీ ఏటా జూన్ 25వ తేదీని సంవిధాన్ హత్య దినోత్సవంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందని అమిత్ షా తన ఎక్స్ ఖాతా ద్వారా స్పష్టం చేశారు.
Also Read: Arvind Kejriwal bail: ఆప్, బీజేపీల మధ్య మాటల యుద్ధం
అమిత్ షా చేసిన ట్విట్‌ను ప్రధాని మోదీ రీ ట్విట్ చేశారు. 1975, జూన్ 25న కాంగ్రెస్ పార్టీ భారతదేశ చరిత్రలో చీకటి దశను ఆవిష్కరించిందన్నారు. దీంతో జూన్ 25వ తేదీని సంవిధాన్ హత్య దివస్‌గా పాటించడం ద్వారా భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడం వల్ల ఏలాంటి అనర్థం జరిగిందో గుర్తు చేసుకోవచ్చునన్నారు. 1975, జూన్ నుంచి 1977, మార్చి వరకు ఎమర్జెన్సీ కారణంగా.. ప్రతిపక్ష నేతలతోపాటు మీడియా స్వేచ్ఛను సైతం హరించిందని పేర్కొన్నారు.
Also Read: Puja Khedkar: మనోరమా కేడ్కర్ తుపాకీతో హల్‌చల్.. వీడియో వైరల్
మరోవైపు జూన్ 25వ తేదీన ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించిన రోజు. ఈ నేపథ్యంలో లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు రాజ్యాంగ ప్రతులను తీసుకు వచ్చారు. ఆ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. రాజ్యాంగంపై తన ప్రేమను ప్రకటించే హక్కు ప్రతిపక్ష పార్టీకి లేదంటూ కాంగ్రెస్ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ముచ్చటగా మూడో సారి ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన అనంతరం పార్లమెంట్ తొలి సమావేశాల్లో ఎమర్జెన్సీ వ్యవహారంపై అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడి వేడి చర్చ జరిగిన సంగతి తెలిసిందే. అందులోభాగంగానే ఇకపై జూన్ 25వ తేదీన దేశవ్యాప్తంగా సంవిధాన్ హత్య దినోత్సవాన్ని జరుపుకోవాలని మోదీ సర్కార్ నిర్ణయించింది.
Also Read: Punjab: ఎంపీ అమృత్ పాల్ సింగ్ సోదరుడు అరెస్ట్
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News