Notifiable Disease: పాముకాటును నోటిఫయబుల్ వ్యాధిగా గుర్తించండి
ABN , Publish Date - Nov 30 , 2024 | 05:34 AM
పాముకాటులను ‘ప్రకటనార్హ వ్యాధి’ (నోటిఫయబుల్ డిసీజ్)గా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించింది.
న్యూఢిల్లీ, నవంబరు 29: పాముకాటులను ‘ప్రకటనార్హ వ్యాధి’ (నోటిఫయబుల్ డిసీజ్)గా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించింది. పాముకాటు బాఽధితులు, ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలను తప్పకుండా ప్రభుత్వానికి పంపించడం కోసం ఈ గుర్తింపు ఇవ్వడం తప్పనిసరి. ప్రయివేటు ఆస్పత్రులకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. ఈ సమాచారం ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. ఈ గుర్తింపు ఇచ్చేలా తగిన ఆదేశాలు జారీ చేయాలని సూచిస్తూ కేంద్రం లేఖ రాసింది. దేశంలో ఏటా 30-40 లక్షల మంది పాము కాటుకు గురవుతుండగా సుమారు 50వేల మంది మరణిస్తున్నారు.