Share News

Katchatheevu Row: కచ్చాతీవును కేంద్రం వెనక్కు తెస్తుందన్న అన్నామలై

ABN , Publish Date - Apr 01 , 2024 | 07:45 PM

కచ్చాతీవులను వెనక్కి తెచ్చుకునేందుకు కేంద్రం అన్ని రకాలుగా ప్రయత్నిస్తోందని, 1974లో తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే వ్యవస్థాపకుడు కరుణానిధి సమ్మతితోనే అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం కచ్చాతీవును శ్రీలంకకు అప్పగించిందని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై అన్నారు.

Katchatheevu Row: కచ్చాతీవును కేంద్రం వెనక్కు తెస్తుందన్న అన్నామలై

చెన్నై: కచ్చాతీపు ద్వీపాన్ని (Katchatheevu island) ఇందిరాగాంధీ ప్రభుత్వం అప్పట్లో శ్రీలంకకు అప్పగించడాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తప్పుపట్టడంపై రాజకీయ దుమారం నడుస్తోంది. కాలం చెల్లిన అంశాన్ని ప్రధాని లేవనెత్తడాన్ని విపక్షాలు నిలదీయగా, తాజాగా ఈ అంశంపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై (Annamalai) స్పందించారు. కచ్చాతీవులను వెనక్కి తెచ్చుకునేందుకు కేంద్రం అన్ని రకాలుగా ప్రయత్నిస్తోందని అన్నారు. 1974లో తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే వ్యవస్థాపకుడు కరుణానిధి సమ్మతితోనే అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం కచ్చాతీవును శ్రీలంకకు అప్పగించిందని ఆరోపించారు.


''అప్పటి విదేశాంగ మంత్రితో కేవల్ సింగ్‌తో తమిళనాడు సీఎం కరుణానిధి మాట్లాడారు. కరుణానిధి అనుమతితోనే కచ్చాతీవును శ్రీలంకకు అ్పపగించారు. ఇప్పుడు, కచ్చాతీవును వెనక్కి తెచ్చేందుకు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు బీజేపీ ఒక లేఖ ఇచ్చింది'' అని అన్నామలై తెలిపారు. మత్స్యకారుల పరిరక్షకు కచ్చాతీవులను వెనక్కి తేవాలనే వైఖరితో బీజేపీ ఉందని, ఇందుకోసం అన్నిరకాలా ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 01 , 2024 | 07:46 PM