Share News

Chalmers University : మొక్కల ఆధారిత నూనెలతో గుండెకు మేలు!

ABN , Publish Date - Jul 16 , 2024 | 02:46 AM

ఆలివ్‌, వేరుశనగ వంటి మొక్కల ఆధారిత నూనెలతో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని స్వీడన్‌లోని చాల్మర్స్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ పరిశోధకులు తాజా అధ్యయనంలో గుర్తించారు.

Chalmers University : మొక్కల ఆధారిత నూనెలతో గుండెకు మేలు!

న్యూఢిల్లీ, జూలై 15: ఆలివ్‌, వేరుశనగ వంటి మొక్కల ఆధారిత నూనెలతో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని స్వీడన్‌లోని చాల్మర్స్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ పరిశోధకులు తాజా అధ్యయనంలో గుర్తించారు. 113 మందిపై చేసిన ఈ అధ్యయన వివరాలను నేచుర్‌ మెడిసిన్‌ అనే జర్నల్‌లో ప్రచురించారు.

అధ్యయనంలో భాగంగా 16 వారాలపాటు కొంతమందికి తృణధాన్యాలు, డ్రైఫ్రూట్స్‌, పండ్లు, కూరగాయలు అధికంగా ఉండే డైట్‌ను అందించారు. ఈ వంటకాలను ఎక్కువగా ఆలివ్‌ నూనెతో వండుతారు. మరికొంత మందికి వెన్న, చేపలు, మాసం, పాలు, స్వీట్లు ఇలా.. అధిక జంతు కొవ్వులతో కూడిన ఆహారాన్ని అందించారు. ఆ తర్వాత వారి రక్తంలోని కొవ్వులను విశ్లేషించారు. జంతు కొవ్వులు తీసుకున్న వారితో పోలిస్తే మొక్కల ఆధారిత కొవ్వులు తీసుకున్న వారి రక్తంలో మల్టీ లిపిడ్‌ స్కోర్‌ (ఎంఎల్‌ఎస్‌) తక్కువగా ఉందని తెలిపారు.

Updated Date - Jul 16 , 2024 | 02:46 AM