Champai Soren: వీడిన ఉత్కంఠ.. బీజేపీలో చేరిన చంపయీ సోరెన్
ABN , Publish Date - Aug 30 , 2024 | 04:36 PM
జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి, జేఏఎం మాజీ సీనియర్ నేత చంపయీ సోరెన్ (Champai Soren) ఎట్టకేలకు సొంత పార్టీని వీడారు. భారతీయ జనతా పార్టీ (BJP)లో శుక్రవారంనాడు చేరారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, జార్ఖాండ్ బీజేపీ అధ్యక్షుడు బాబూలాల్ మిరాండి సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు.
న్యూఢిల్లీ: జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి, జేఏఎం (JMM) సీనియర్ నేత చంపయీ సోరెన్ (Champai Soren) ఎట్టకేలకు సొంత పార్టీని వీడారు. భారతీయ జనతా పార్టీ (BJP)లో శుక్రవారంనాడు చేరారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, జార్ఖాండ్ బీజేపీ అధ్యక్షుడు బాబూలాల్ మిరాండి సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. చంపయీ సోరెన్ గత బుధవారంనాడు జేఎంఎంకి రాజీనామా చేశారు. ''అధ్యక్ష తరహా పనితీరు, రాజకీయాలు కారణంగా తప్పనిసరై ఎన్నో ఏళ్లుగా సేవలందించిన జేఎంఎంను విడిచిపెట్టాను'' అని తెలిపారు. ఎమ్మెల్యే పదవికి, రాష్ట్ర మంత్రివర్గానికి కూడా ఆయన రాజీనామా చేసారు.
జేఎంఎం సుప్రీం శిబు సోరెన్‌కు చంపయీ సోరెన్ ఒక లేఖ సైతం రాస్తూ, జేఎంఎంను విడిచిపెట్టాల్సి వస్తుందని తాను కలలో కూడా అనుకోలేదన్నారు. జేఎంఎంను తన కుటుంబ పార్టీగా భావించానని, గత కొద్దిరోజులుగా చోటుచేసుకున్న పరిణామాలతో పార్టీని వీడాల్సి వచ్చిందని తెలిపారు. సిద్ధాంతాలకు జేఎంఎం తిలోదకాలు ఇచ్చందని చెప్పడానికి విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. పార్టీలో ఎవరికీ తమ ఆవేదన చెప్పుకునేందుకు ఒక వేదిక లేదని అన్నారు. ఆరోగ్య సమస్యల కారణంగా మీరు (సిబు సోరెన్) చురుకైన రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, మీరే నాకు మార్గదర్శకంగా కొనసాగుతారని ఆ లేఖలో చంపయీ సోరెన్ పేర్కొన్నారు.
Kolkata Doctor rape and murder: నా లేఖలు బదులివ్వలేదు.. మోదీకి మరో లేఖ రాసిన దీదీ
మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ రాజీనామా నేపథ్యంలో గత ఫిబ్రవరి 2న చంపయీ సోరెన్ జార్ఖాండ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఐదు నెలల తర్వాత బెయిలుపై హేమంత్ విడుదల కావడంతో చంపయీ సోరెన్ రాజీనామా చేసి తిరిగి హేమంత్‌కు సీఎం పగ్గాలు అప్పగించారు. ఈ అనూహ్య పరిణామం చంపయీ సోరెన్‌ను తీవ్ర అసంతృప్తికి గురిచేయగా, ఎట్టకేలకు ఆయన జేఎంఎంను వీడి బీజేపీలో చేరారు.
Read More National News and Latest Telugu News