Chennai: ‘స్పేస్ బే’గా 4 జిల్లాలు.. పదేళ్లలో 10 వేలమందికి ఉద్యోగాలు
ABN , Publish Date - Jul 02 , 2024 | 12:18 PM
రాష్ట్రంలో అంతరిక్ష సంబంధిత పరిశ్రమలు నెలకొల్పే సంస్థలకు ప్రభుత్వం కల్పించనున్న సదుపాయాలు, రాయితీలకు సంబంధించిన నూతన అంతరిక్ష విధానాన్ని టిడ్కో విడుదల చేసింది. రాష్ట్రంలో భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) ఆధ్వర్యంలో కులశేఖరపట్టినం(Kulasekharapattinam) వద్ద రెండో రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
- నూతన అంతరిక్ష విధానం విడుదల
చెన్నై: రాష్ట్రంలో అంతరిక్ష సంబంధిత పరిశ్రమలు నెలకొల్పే సంస్థలకు ప్రభుత్వం కల్పించనున్న సదుపాయాలు, రాయితీలకు సంబంధించిన నూతన అంతరిక్ష విధానాన్ని టిడ్కో విడుదల చేసింది. రాష్ట్రంలో భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) ఆధ్వర్యంలో కులశేఖరపట్టినం(Kulasekharapattinam) వద్ద రెండో రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆ కేంద్రం చుట్టూ ఉన్న తూత్తుకుడి, తిరునల్వేలి, మదురై, విరుదునగర్ జిల్లాలను ‘స్పేస్ బే’గా ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఈ నాలుగు జిల్లాలను అంతరిక్ష సంబంధిత పరిశ్రమల విస్తరణ జిల్లాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసి అధికారిక ప్రకటన చేసింది.
ఇదికూడా చదవండి: Lok Sabha Updates: పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. మోదీపై అఖిలేష్ సెటైర్లు..
నూతన అంతరిక్ష విధానం ప్రకారం ఈ నాలుగు జిల్లాల్లో రూ.300 కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టే సంస్థలకు మూలధన సబ్సిడీ, చౌక ధరలకు భూములు, విద్యుత్ సంబంధిత రాయితీలు కల్పించనున్నారు. ఎ కేటగిరిలో ఉన్న చెన్నై సహా నాలుగు జిల్లాల్లో అంతరిక్ష పరిశోధన సంబంధిత పరిశ్రమలు స్థాపించేవారికి ఐదు శాతం మూలధన రాయితీని ఐదేళ్ల వరకూ కొనసాగించనున్నారు. అదే విధంగా బి కేటగిరిలో ఉన్న కోయంబత్తూరు, ఈరోడ్ సహా 18 జిల్లాల్లో పరిశ్రమలు పెడితే ఏడు శాతం మూలధన రాయితీ ఐదేళ్ల వరకు అందించనున్నారు. సి కేటగిరిలో ఉన్న ధర్మపురి, కన్నియాకుమారి సహా 19 జిల్లాల్లో పరిశ్రమలు స్థాపిస్తే పది శాతం సబ్సిడీని పదేళ్ల వరకు అందించనున్నారు. డి కేటగిరిలో ఉన్న మదురై, తూత్తుకుడి, తిరునల్వేలి, విరుదునగర్(Madurai, Thoothukudi, Thirunalveli, Virudhunagar) జిల్లాలను స్పేస్ బే జిల్లాలుగా ప్రకటించడంతో ఆ జిల్లాల్లో అంతరిక్ష పరిశోధన సంబంధిత పరిశ్రమలను విరివిగా విస్తరింపజేయనున్నారు.
ఇదికూడా చదవండి: రాహుల్ క్షమాపణ చెప్పాలి: షా
ఏ, బీ కేటగిరి జిల్లాలోని సిప్కాట్, సిడ్కో, టిడ్కో తదితర పారిశ్రామిక వాడల్లో పెట్టుబడులు పెడితే భూముల ధరలో 20 శాతం రాయితీ ప్రకటించనున్నారు. సీ. డీ కేటగిరిలోని జిల్లాల్లో పరిశ్రమలు స్థాపిస్తే 50 శాతం రాయితీ ధరతో భూములు కేటాయిస్తారు. అంతే కాకుండా భూములు కొనుగోలు చేసేటప్పుడు వంద శాతం స్టాంపు డ్యూటీ కూడా మినహాయించనున్నారు. ఐదేళ్లపాటు విద్యుత్ పన్ను నుంచి వంద శాతం మినహాయిస్తారు. అంతే కాకుండా ప్రభుత్వ నూతన అంతరిక్ష విధానం ద్వారా పదేళ్లలో పదివేల మందికి నెలకు కనీసం రూ.10వేల వేతనంతో ఉద్యోగవకాశాలు లభిస్తాయని కూడా సిడ్కో అధికారులు ప్రకటించారు.
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News