Chennai: సీఎంగారూ.. సీబీఐ విచారణకు సిద్ధమేనా..
ABN , Publish Date - Dec 11 , 2024 | 12:01 PM
తమిళనాడు విద్యుత్ బోర్డు (టీఎన్‌ఈబీ)లో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణకు సిద్ధమేనా అని పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. భారత సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి సౌర విద్యుత్ కొనుగోలు చేసేందుకు టీఎన్‌ఈబీకి ఆదానీ సంస్థ ముడుపులు చెల్లించినట్లు అమెరికా కోర్టులో దాఖలైన కేసుపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని అన్బుమణి డిమాండ్ చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.
- విద్యుత్ బోర్డ్ అవినీతిపై పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి సవాల్
చెన్నై: తమిళనాడు విద్యుత్ బోర్డు (టీఎన్‌ఈబీ)లో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణకు సిద్ధమేనా అని పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి(PMK President Anbumani) రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. భారత సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి సౌర విద్యుత్ కొనుగోలు చేసేందుకు టీఎన్‌ఈబీకి ఆదానీ సంస్థ ముడుపులు చెల్లించినట్లు అమెరికా కోర్టులో దాఖలైన కేసుపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని అన్బుమణి డిమాండ్ చేస్తూ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈ వార్తను కూడా చదవండి: CM Stalin: అదానీతో భేటీ అవాస్తవం.. ఆ గ్రూపుతో ఒప్పందాల్లేవ్..
ఆదానీకి సంబంధించిన అవినీతి ఆరోపనలపై పార్లమెంట్ ఉమ్మడి కమిటీ విచారణ జరిపేందుకు పీఎంకే మద్దతు ఉంటుందని, ఈ వ్యవహారంలో తమకు ఎలాంటి సంకోచం లేదన్నారు. టీఎన్‌ఈబీకి ఆదానీ సంస్థ పెద్ద మొత్తంలో ముడుపులు చెల్లించిందనే ఆరోపనలపై ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) ఎలాంటి సమాధానం చెప్పకుండా కాలయాపన చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఆదానీ సంస్థ వంటి పలు సంస్థల నుంచి లబ్దిపొందాలన్న దృష్టితోనే డీఎంకే పాలకులు అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేశారని, దీనిపై తమ పార్టీ పలు మార్లు సమాజిక మాధ్యమాల ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించినా ఎలాంటి సమాధానం లేదన్నారు. ఆదానీ సంస్థల నుంచి ముడుపులు పొందినట్లు వస్తున్న ఆరోపనలపై సీబీఐ విచారణకో, సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణకు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రభుత్వం సిద్ధమేనా అని అన్బుమణి ప్రశ్నించారు.
ఈవార్తను కూడా చదవండి: విగ్రహాల మీద ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేదా?
ఈవార్తను కూడా చదవండి: తినే మాంసంలో.. యాంటీబయాటిక్స్
ఈవార్తను కూడా చదవండి: సింగరేణి సీఎండీ రేసులో శైలజా రామయ్యర్!
ఈవార్తను కూడా చదవండి: ఆన్‌లైన్‌లో భద్రాద్రి ముక్కోటి దర్శన టికెట్లు
Read Latest Telangana News and National News