Share News

Chennai: ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు సీఎం స్టాలిన్ తీపి కబురు.. అదేంటంటే..

ABN , Publish Date - Oct 11 , 2024 | 11:11 AM

ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు 2023-24 సంవత్సరానికిగాను 20 శాతం బోనస్‌ ఇవ్వన్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) ప్రకటించారు. సవరించిన బోనస్‌ చట్టం 2015 ప్రకారం అత్యధిక వేతనం పొందటానికి అర్హత కలిగిన వేతన గరిష్ట పరిమితిని రూ.21,000లకు పెంచామని, ఆ మేరకు గరిష్ట వేతనాన్ని లెక్కగట్టి నెలసరి వేతన గరిష్ట వేతన పరిమితి రూ. 7వేలు ప్రకటిస్తున్నామన్నారు.

Chennai: ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు సీఎం స్టాలిన్ తీపి కబురు.. అదేంటంటే..

- 20 శాతం బోనస్‌ ఫ 2.75 లక్షల మందికి దీపావళి కానుక

చెన్నై: ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు 2023-24 సంవత్సరానికిగాను 20 శాతం బోనస్‌ ఇవ్వన్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) ప్రకటించారు. సవరించిన బోనస్‌ చట్టం 2015 ప్రకారం అత్యధిక వేతనం పొందటానికి అర్హత కలిగిన వేతన గరిష్ట పరిమితిని రూ.21,000లకు పెంచామని, ఆ మేరకు గరిష్ట వేతనాన్ని లెక్కగట్టి నెలసరి వేతన గరిష్ట వేతన పరిమితి రూ. 7వేలు ప్రకటిస్తున్నామన్నారు. ఆ మేరకు నెలసరి వేతనాల గరిష్ట పరిమితి రూ.21,000లుగా సడలించి, సీ, డీ కేటగిరీల ఉద్యోగులకు 2023-24 సంవత్సరానికిగాను బోనస్‌, ఎక్స్‌గ్రేషియా చెల్లించేలా ఆదేశించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వెలువరించిన ప్రకటన మేరకు వివిధ ప్రభుత్వ రంగ సంస్థలలో కార్మికులు, సిబ్బంది పొందనున్న బోనస్‌ వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ వార్తను కూడా చదవండి: రూ.229 కోట్ల భారీ మోసం.. ఎలా జరిగిందంటే..


1. లాభసాటి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ‘సీ’, ‘డీ’ కేటగిరి కార్మికులు, సిబ్బందికి 8.33 శాతం బోనస్‌ 11.67 శాతం ఎక్స్‌గ్రేషియా చొప్పున మొత్తం 20 శాతం బోనస్‌ చెల్లిస్తారు.

2. రాష్ట్ర విద్యుదుత్పత్తి, పంపిణీ సంస్థలు, ప్రభుత్వ రవాణా సంస్థలు, ప్రభుత్వ వినియోగదారుల వాణిజ్య సంస్థలు, రాష్ట్ర పాల ఉత్పత్తి దారుల సహకార సంస్థల్లో పనిచేసే అర్హత కలిగిన ‘సీ’, ‘డీ’ కేటగిరీ కార్మికులు, సిబ్బందికి కూడా 8.33 శాతం బోనస్‌, 11.67 శాతం ఎక్స్‌గ్రేషియా మొత్తం 20 శాతం బోనస్‌ చెల్లించనున్నారు.

3. లాభాలతో నిమిత్తం లేకుండా పనిచేసే ప్రభుత్వ రంగ సంస్థల్లో ‘సీ’, ‘డీ’ కేటగిరి కార్మికులు, సిబ్బంది 8.33 శాతం బోనస్‌, 1.67 శాతం ఎక్స్‌గ్రేషియా అంటూ మొత్తం 10 శాతం బోనస్‌ అందుకోనున్నారు.


4. రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ, చెన్నై తాగునీటి సరఫరా సంస్థ, మురుగునీటి తొలగింపు సంస్థ కార్మికులు, సిబ్బందికి కూడా 8.33 శాతం బోనస్‌, 1.67 శాతం ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తారు.

5. రాష్ట్ర నీటిసరఫరా సంస్థలో పనిచేసే ‘సీ’, ‘డీ’ కేటగిరీ కార్మికులు 8.33 శాతం బోనస్‌ మాత్రమే చెల్లిస్తారు.

6. ఇవికాకుండా రాష్ట్ర వినియోగదారుల వాణిజ్య సంస్థలో కాంట్రాక్టు కార్మికులు రూ.3000లు ఎక్స్‌గ్రేషియా అందుకోనున్నారు.

అర్హత కలిగిన కార్మికులు, సిబ్బంది ఈ యేడాది కనీసపక్షంగా రూ.8400లు, అధికపక్షంగా రూ.16800లను బోన్‌సగా అందుకోనున్నారు. ఈ బోన్‌సను 2 లక్షలా 75 వేలా 670 మంది కార్మికులు, సిబ్బంది లబ్ది పొందనున్నారు. వీరికి రూ.369 కోట్లా 65 లక్షలను బోన్‌సగా ఎక్స్‌గ్రేషియా రూపంలో చెల్లించనున్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు చెరువులు బాగుపడిందెలా?

ఇదికూడా చదవండి: Yadagirigutta: దసరా నుంచి స్వర్ణతాపడం పనులు

ఇదికూడా చదవండి: Hyderabad: అది పరిహారం కాదు.. పరిహాసం: కేటీఆర్‌

ఇదికూడా చదవండి: Manda krishna: వర్గీకరణ తర్వాతే నోటిఫికేషన్లు ఇవ్వాలి

Read Latest Telangana News and National News

Updated Date - Oct 11 , 2024 | 11:11 AM