Chennai: మేం పిలిస్తే డిప్యూటీ సీఎం ఉదయనిధే వస్తారు!
ABN , Publish Date - Oct 22 , 2024 | 12:39 PM
మెరీనా బీచ్(Marina Beach) సర్వీసు రోడ్డులో గస్తీ తిరుగుతున్న పోలీసులపై పీకలదాకా తాగిన ఓ జంట విరుచుకుపడింది. అర్థరాత్రి పూట ఉండకూడదని, త్వరగా ఇంటికి వెళ్లమంటూ సలహా ఇచ్చిన పుణ్యానికి ఆ జంట పోలీసులను దుర్భాషలాడింది.
- మెరీనాలో పోలీసులను దుర్భాషలాడిన జంట
చెన్నై: మెరీనా బీచ్(Marina Beach) సర్వీసు రోడ్డులో గస్తీ తిరుగుతున్న పోలీసులపై పీకలదాకా తాగిన ఓ జంట విరుచుకుపడింది. అర్థరాత్రి పూట ఉండకూడదని, త్వరగా ఇంటికి వెళ్లమంటూ సలహా ఇచ్చిన పుణ్యానికి ఆ జంట పోలీసులను దుర్భాషలాడింది. మేం సాదాసీదా వ్యక్తులం కాము.. మేం పిలిస్తే డిప్యూటీ సీఎం ఉదయనిధి(Deputy CM Udayanidhi) క్షణాల్లో వస్తారు అంటూ బెదిరించింది. మెరీనా బీచ్‌లో గస్తీ పోలీసులు అర్ధరాత్రి పూట వాహనాలను తనిఖీ చేయడం ఆనవాయితీ. ఆ ప్రకారం ఆదివారం రాత్రి సర్వీసు రోడ్డులో పార్కింగ్ చేసి ఉన్న కారు వద్దకు వెళ్లి తనిఖీ చేశారు.
ఈ వార్తను కూడా చదవండి: Gautami: నటి గౌతమికి అన్నాడీఎంకే ప్రచార పదవి
ఆ కారులో ఓ జంట మద్యం మత్తులో జోగుతుండటం గమనించి, త్వరగా ఇంటికి వెళ్లాల్సిందిగా సలహా ఇచ్చారు. అంతే ఆ జంట కారు డోర్ తెరుచుకుని చేతులు ఊపుకుంటూ బెదిరిస్తూ పోలీసులపై బూతుల వర్షం కురిపించింది. ఆ దృశ్యాలను ఓ కానిస్టేబుల్ సెల్‌ఫోన్‌లో వీడియో తీస్తుంటే ఆ జంట అసభ్యంగా పోజులిచ్చి తమను బాగా వీడియో తీయమంటూ రెచ్చగొట్టింది. ఇలా పావుగంటకుపైగా పోలీసులను తిట్టిన ఆ జంట కారులో ఉడాయించింది.
ఈ సంఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో ప్రసారమైంది. ఈ విషయమై గస్తీ విభాగ పోలీసు అధికారి మాట్లాడుతూ... వీడియోలో నమోదైన ఆ కారు నెంబర్ ఆధారంగా పోలీసులు వారిని గుర్తుపట్టారు. పోలీసుల విచారణలో వారు భార్యాభర్తలు కాదని వెల్లడైంది. పోలీసులు తీవ్ర గాలింపులు జరిపిన మీదట వేళచ్చేరి హోటల్‌లో ఉన్న ఆ జంటను మైలాపూరు పోలీసులు అరెస్టు చేశారు.
.......................................................................
ఈ వార్తను కూడా చదవండి:
...........................................................................
Chennai: ఈ సారికి వానరాలకేనా...!
- సీతాఫలాల వేలం రద్దు: అటవీశాఖ
చెన్నై: శివగంగ జిల్లా సింగంపురణి(Singampurani) సమీపంలో కొండ ప్రాంతాల్లో సీతాఫలం విరగ్గాసింది. కానీ, కోతులకు ఆహారం అందించేలా ఈ పండ్ల వేలాన్ని అటవీ శాఖ అధికారులు రద్దు చేశారు. ప్రాణమలై, ఓడువన్‌పట్టి, మేలవన్నాయిరుప్పు, సెల్లియంపట్టి తదితర కొండ ప్రాంతాల్లో సీతాఫలం చెట్లు అధికంగా ఉన్నాయి. ఈ ప్రాంతం అటవీ శాఖకు సొంతం కాగా, యేటా సీజన్‌లో సీతాఫలం పండ్లు వేలం వేస్తుంటారు. కానీ, కొంతకాలంగా అటవీ ప్రాంతాల్లో ఆహారం లభించకపోవడవంతో, అక్కడి కోతులు ఆహారం వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకు వెళ్తున్నాయి. దీన్ని అడ్డుకొనేలా ఈ ఏడాది సీతాఫలం వేలం నిలిపివేసిన అటవీ శాఖ, ఆ పండ్లు ఎవరూ కోయరాదని ప్రకటించింది.
ఇదికూడా చదవండి: Real Estate: ప్రభుత్వ అనుమతులుంటే కూల్చరు!
ఇదికూడా చదవండి: KTR : రేవంత్ చెప్పేవి పచ్చి అబద్ధాలు!
ఇదికూడా చదవండి: TGSPDCL: కరెంటు అంతరాయమా.. డయల్ 1912
ఇదికూడా చదవండి: Thummala: రుణమాఫీ చేసి తీరుతాం.. ఏ ఒక్క రైతు అధైర్యపడొద్దు
Read Latest Telangana News and National News