Chennai: మరణిస్తూ... ఆరుగురికి పునర్జన్మ
ABN , Publish Date - Dec 27 , 2024 | 11:06 AM
బ్రెయిన్ డెడ్ అయిన యువకుడు అవయవదానంలో ఆరుగురు పునర్జన్మ పొందారు. రామనాథపురం(Ramanathapuram) జిల్లా కడలాడి ప్రాంతానికి చెందిన సంజయ్ (22) ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. ఈ నెల 22న కొత్త ద్విచక్రవాహనం కొనుగోలు చేసేందుకు మదురైలోని షోరూమ్‌కు వెళ్లాడు.
చెన్నై: బ్రెయిన్ డెడ్ అయిన యువకుడు అవయవదానంలో ఆరుగురు పునర్జన్మ పొందారు. రామనాథపురం(Ramanathapuram) జిల్లా కడలాడి ప్రాంతానికి చెందిన సంజయ్ (22) ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. ఈ నెల 22న కొత్త ద్విచక్రవాహనం కొనుగోలు చేసేందుకు మదురైలోని షోరూమ్‌కు వెళ్లాడు. టెస్ట్ డ్రైవ్ చేసేందుకు హెల్మెట్ సరిగా పెట్టుకోకుండా సంజయ్ వెళ్లినట్లు సమాచారం. వాహనంపై వెళ్తున్న సమయలో హఠాత్తుగా కింద పడిన సంజయ్ తలకు బలమైన గాయాలయ్యాయి.
ఈ వార్తను కూడా చదవండి: Elephant: బుల్లెట్ ఏనుగుకు మత్తు ఇంజక్షన్..
అతడిని వెంటనే మదురై మీనాక్షి మిషన్ ఆస్పత్రి(Madurai Meenakshi Mission Hospital)కి తరలించగా, ఈ నెల 24వ తేది రాత్రి బ్రెయిన్‌డెడ్(Braindead) అయినట్లు వైద్యులు నిర్ధారించారు. వైద్యుల సూచనలతో సంజయ్ అవయవాలు దానం చేసేందుకు కుటుంబసభ్యులు అంగీకరించారు. అవయవదానం చేసిన సంజయ్‌కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
ఈవార్తను కూడా చదవండి: ఎలాంటి ప్రలోభాలు లేకుండా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం
ఈవార్తను కూడా చదవండి: SBI: ఎస్‌బీఐలో 600పీవో పోస్టులకు నోటిఫికేషన్
ఈవార్తను కూడా చదవండి: ములుగు ఏజన్సీలో టెన్షన్ టెన్షన్.. మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాలు..
ఈవార్తను కూడా చదవండి: తుపాకులతో పట్టుపడిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. చివరికి ఆరా తీస్తే..
Read Latest Telangana News and National News