Chennai: స్టేషన్ల సమీపంలోని మద్యం దుకాణాలు తొలగించాలి..
ABN , Publish Date - Sep 24 , 2024 | 12:27 PM
రాష్ట్రవ్యాప్తంగా రైల్వేస్టేషన్ల సమీపంలో ఉన్న 39 టాస్మాక్ మద్యం దుకాణాలను తొలగించాలని రాష్ట్రప్రభుత్వాన్ని దక్షిణ రైల్వే(Southern Railway) కోరింది. చెన్నై, తిరువళ్లూర్, కాంచీపురం, చెంగల్పట్టు(Chennai, Thiruvallur, Kanchipuram, Chengalpattu) సహా పలు జిల్లాలకు నడుపుతున్న రైలు ప్రయాణికుల వద్ద దోపిడీ, దాడి సంఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో రైళ్లు ఢీకొని ప్రజలు మరణించడంపై దక్షిణ రైల్వే తాజాగా ఓ సర్వే నిర్వహించింది.
- దక్షిణ రైల్వే విజ్ఞప్తి
చెన్నై: రాష్ట్రవ్యాప్తంగా రైల్వేస్టేషన్ల సమీపంలో ఉన్న 39 టాస్మాక్ మద్యం దుకాణాలను తొలగించాలని రాష్ట్రప్రభుత్వాన్ని దక్షిణ రైల్వే(Southern Railway) కోరింది. చెన్నై, తిరువళ్లూర్, కాంచీపురం, చెంగల్పట్టు(Chennai, Thiruvallur, Kanchipuram, Chengalpattu) సహా పలు జిల్లాలకు నడుపుతున్న రైలు ప్రయాణికుల వద్ద దోపిడీ, దాడి సంఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో రైళ్లు ఢీకొని ప్రజలు మరణించడంపై దక్షిణ రైల్వే తాజాగా ఓ సర్వే నిర్వహించింది. అందులో వేలూరు, రాణిపేట, చెన్నై(Vellore, Ranipet, Chennai) మార్గంలో ఉన్న రైల్వేస్టేషన్ల సమీపంలో 10 నుంచి 200 మీటర్ల దూరంలో ఉన్న టాస్మాక్ దుకాణాలే దోపిడీ, దాడులకు కారణమని తెలిసింది.
ఇదికూడా చదవండి: కేజ్రీ కోసం కుర్చీ ఖాళీగా..
ఈ ప్రాంతాల్లో ఉన్న టాస్మాక్ దుకాణాల్లో మద్యం సేవించి మత్తులో రైలుపట్టాలు దాటుతూ రైలు ఢీకొని పలువురు మరణించారని, మరికొందరు సంఘ విద్రోహులు ప్రయాణికులపై దాడులకు పాల్పడడంతో పాటు దోచుకుంటున్నట్లు తెలిసింది. మరికొందరు రైలు మార్గంలో ఉన్న సిగ్నల్స్ ధ్వంసం చేయడంతో పాటు విలువైన కాపర్ వైర్లు అపహరిస్తున్నట్లు సర్వేలో తెలిసింది. ఇలాంటి దుస్సంఘటనలు నివారించే దిశగా రైల్వేస్టేషన్ల సమీపంలోని టాస్మాక్ దుకాణాలు తొలగించేలా రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టాలని దక్షిణ రైల్వే విజ్ఞప్తి చేసింది.
........................................................
ఈ వార్తను కూడా చదవండి:
............................................................
Chennai: మహాబలిపురంలో వెనక్కి మళ్ళిన సముద్రం
- దర్శనమిచ్చిన మహిషాసురమర్థిని గుహాలయం
చెన్నై: చెంగల్పట్టు జిల్లాలోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన చారిత్రక నగరం మహాబలిపురం(Mahabalipuram)లో సముద్రం వెనక్కిమళ్ళడంతో సముద్రతీర దేవాలయం వద్దనున్న మహిషాసుర మర్థిని గుహాలయం పూర్తిగా దర్శనమిచ్చింది. దీంతో స్థానికులు, పర్యాటకులు ఆలయంలోని దుర్గాదేవిని దర్శించేందుకు బారులు తీరారు. మహాబలిపురంలో పల్లవుల కాలం నాటి ప్రాచీన చిహ్నాల్లో సముద్రతీర ఆలయం అత్యంత ప్రాధాన్యమైంది. ఐదు దశాబ్దాల క్రితం సముద్రజలాలు రావటంతో సముద్రతీర దేవాలయం నీటమునిగింది.
దీంతో పురావస్తు పరిశోధక విభాగం అధికారులు 1984లో ఆ ఆలయం చుట్టూ ప్రహరీలా పెద్ద పెద్ద బండరాళ్లను పేర్చారు. అదే చోట సముద్రతీర దేవాలయానికి ఉత్తరదిశగా పల్లవరాజులు చిన్న కొండలా ఉన్న బండరాయిలో నిర్మించిన మహిషాసురమర్థిని గుహాలయం ఉంది. ఆ గుహాలయంలో దుర్గాదేవి శిల్పం కూడా ఉంది. మాసిమఖం రోజున సముద్రతీరంలో గిరిజనులు సముద్రపునీటిలో సగం వరకు మునిగి ఉండే ఈ ఆలయం చుట్టూ నిలిచి ప్రత్యేక పూజలు చేయటం ఆనవాయితీ. మాసిమఖం రోజున ఈ ఆలయం మూడడుగుల ఎత్తుమేర సముద్రజలాల్లో మునిగిఉంటుంది.
సముద్రతీర దేవాలయానికి బండరాళ్లతో ప్రహారీ నిర్మించేటప్పుడు దాని వెనుకే ఉన్న ఈ గుహాలయంలో సముద్రజలాలు చొరబడకుండా ఉండేందుకు పురావస్తు అధికారులు ఎలాంటిచర్యలు చేపట్టలేదు. దీంతో ఈ గుహాలయంకొన్ని నెలలపాటు సముద్రజలాల్లో పూర్తిగా లేదా సగం వరకూ మునిగి ఉండటం, మరికొద్ది మాసాలు గుహాలయం పూర్తిగా కనిపించటం ఆనవాయితీగా మారింది. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా ఆ ప్రాంతం వద్ద సముద్రం వెనక్కి మళ్లటంతో ఈ గుహాలయం పూర్తిగా బయల్పడింది. దీంతో స్థానికులు, పర్యాటకులు ఈ మహిషాసురమర్థిని గుహాలయాన్ని సందర్శించడానికి బారులు తీరారు.
ఇదికూడా చదవండి: Congress: డీసీసీ కార్యాలయాలకు స్థలాలు!
ఇదికూడా చదవండి: Regional Ring Road: ఆర్‌ఆర్‌ఆర్‌కు వరల్డ్ బ్యాంక్ నిధులు..
ఇదికూడా చదవండి: Hanumakonda: కొడుకులు తిండి పెట్టట్లేదు.. మా భూమిని తిరిగి ఇప్పించండి సారూ!
Read Latest Telangana News and National News