Chennai: 9న పాండీబజార్‌లో 2 కి.మీ.ల వరకు మోదీ రోడ్‌షో
ABN , Publish Date - Apr 05 , 2024 | 11:25 AM
రాష్ట్రంలో ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయడానికి ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) ఈ నెల తొమ్మిదిన వేలూరు విచ్చేస్తున్నారు.
చెన్నై: రాష్ట్రంలో ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయడానికి ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) ఈ నెల తొమ్మిదిన వేలూరు విచ్చేస్తున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు ఆ నగరంలో ఏర్పాటు చేసే బ్రహ్మాండమైన రోడ్‌షోలో మోదీ పాల్గొని ఎన్డీయే కూటమి తరఫున పోటీచేస్తున్న న్యూ జస్టిస్ పార్టీ నేత ఏసీ షణ్ముగం, పీఎంకే అభ్యర్ధి సౌమ్యా అన్బుమణి, కడలూరు పీఎంకే అభ్యర్థి తంగర్‌బచ్చన్ కోసం ప్రచారంచేయనున్నారు. ఆ తర్వాత వేలూరు నుంచి హెలికాప్టర్(Helicopter)లో బయలుదేరి చెన్నై విమానాశ్రయం చేరుకుని కారులో నందనం మీదుగా టి. నగర్ పానగల్ పార్కు ప్రాంతానికి విచ్చేస్తారు. అక్కడి నుండి పాండీబజార్ మీదుగా తేనాంపేట సిగ్నల్ దాకా రోడ్‌షోలో పాల్గొని చెన్నై నగర పరిధిలో పోటీ చేస్తున్న ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో పోలీసులు ఐదంచెల భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు.
ఇదికూడా చదవండి: Lok Sabha Elections: రూ.50వేలకు మించి ఉంటే స్వాధీనమే..