Share News

Chennai: ఉరుములు మెరుపులతో వర్షం.. రెండో రోజూ విమాన సేవలకు అంతరాయం

ABN , Publish Date - Jun 20 , 2024 | 11:45 AM

గ్రేటర్‌ చెన్నై(Greater Chennai), నగర శివారు ప్రాంతాల్లో రెండో రోజైన బుధవారం కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అందువల్ల నగరంలోని జాతీయ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో టేకాఫ్‌, టేకాన్‌ కావాల్సిన 26 విమానాల సేవలకు అంతరాయం ఏర్పడింది.

Chennai: ఉరుములు మెరుపులతో వర్షం.. రెండో రోజూ విమాన సేవలకు అంతరాయం

చెన్నై : గ్రేటర్‌ చెన్నై(Greater Chennai), నగర శివారు ప్రాంతాల్లో రెండో రోజైన బుధవారం కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అందువల్ల నగరంలోని జాతీయ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో టేకాఫ్‌, టేకాన్‌ కావాల్సిన 26 విమానాల సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా నగరంలో రాత్రిపూట అకస్మాతుగా భారీ వర్షపు జల్లులు కురుస్తున్నాయి. ఈ కారణంగా ముంద జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తున్నారు. దీంతో నగర వాసులు ఉక్కపోతతో తల్లడిల్లుతూ జాగారం చేస్తున్నారు. రెండో రోజైన బుధవారం కేరళలోని కోళికోడ్‌ నుంచి 70 మంది ప్రయాణికులతో దిగాల్సిన విమానం, ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమానం, తదితర 12 ఫ్లైట్స్‌ ల్యాండ్‌ కాలేక గాల్లోనే చక్కర్లు కొట్టారు. అదేవిధంగా మదురై, ముంబై, కోవై, ఢిల్లీ, హైదరాబాద్‌, గోవా, వారణాసి తదితర ప్రాంతాలకు వెళ్ళే విమాన సేవలకు కూడా అంతయారం ఏర్పడింది. అలాగే, అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్‌, కువైట్‌, సింగపూర్‌, కౌలాంపూర్‌, అబుదాబి, బ్యాంకాక్‌ తదితర దేశాలకు వెళ్ళాల్సిన మరో 14 విమానాలు వాతావరణం అనుకూలించని కారణంగా రాత్రి ఆలస్యంగా బయలుదేరి వెళ్ళాయి.

ఇదికూడా చదవండి: Annamalai: ‘కమల’ వికాసానికి కృషిచేద్దాం...


నీలగిరి జిల్లాను ముంచెత్తిన భారీ వర్షం

ప్రముఖ పర్యాటక ప్రాంతం, వేసవి విడిది కేంద్రంగా గుర్తింపు పొందిన నీలగిరి జిల్లాలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. గూడలూరు ప్రాంతంలో కురిసిన వర్షాలకు ప్రధాన రహదారులు జలమయంకాగా, 30కి పైగా గృహాల్లోకి వర్షపునీరు వచ్చి చేరింది. గూడలూరులో మంగళవారం సాయంత్రం దాదాపు 2 గంటల పాటు మోస్తరు వర్షం కురిసిన కారణంగా ఈ ప్రాంతంలో ఉన్న చెరువుల్లో నీటి మట్టాలు పెరిగాయి. లోతట్టు ప్రాంతాలు, వ్యవసాయ భూముల్లో వర్షపునీరు వచ్చి చేరింది. సిట్రార్‌ వాగులో ఏర్పడిన వరద ప్రవాహానికి పరిసర ప్రాంతాల్లో ఉన్న గృహాల్లో వర్షపునీరు చేరడంతో ఇంటిలోని సామాగ్రి అంటా నీట మునిగిపోయింది. అలాగే, అనేక పొలాల్లో చేతికొచ్చిన పంట నీట మునిగిందని రైతులు వాపోతున్నారు. సిట్రారు వాగులో తరచుగా వరద ప్రవాహం ఏర్పడుతున్నందున తీవ్రంగా నష్టపోతున్నామని, గత రెండేళ్ళ క్రితం పూడికతీత పనులు చేపట్టారని, అయితే, వర్షం కురవని రోజుల్లో ఈ వాగులో మళ్ళీ పూడికతీత పనులు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వర్షం కారణంగా దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని వారు కోరుతున్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 20 , 2024 | 11:45 AM