Share News

Chennai: ‘ఉప ముఖ్యమంత్రిని డ్రెస్‌కోడ్‌ పాటించాలని చెప్పండి’

ABN , Publish Date - Oct 19 , 2024 | 01:29 PM

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(State Deputy Chief Minister Udayanidhi) ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే సమయంలో డ్రెస్‌ కోడ్‌ పాటించేలా ఉత్తర్వులివ్వాలని కోరుతూ మద్రాసు హైకోర్టు(Madras High Court)లో పిటిషన్‌ దాఖలైంది.

Chennai: ‘ఉప ముఖ్యమంత్రిని డ్రెస్‌కోడ్‌ పాటించాలని చెప్పండి’

- మద్రాసు హైకోర్టులో పిటిషన్‌

చెన్నై: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(State Deputy Chief Minister Udayanidhi) ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే సమయంలో డ్రెస్‌ కోడ్‌ పాటించేలా ఉత్తర్వులివ్వాలని కోరుతూ మద్రాసు హైకోర్టు(Madras High Court)లో పిటిషన్‌ దాఖలైంది. ఈ వ్యవహారంపై న్యాయవాది సత్యకుమార్‌ దాఖలుచేసిన పిటిషన్‌లో... 2019 జూన్‌ 1వ తేది జారీ చేసిన నెం.67 ప్రభుత్వ ఉత్వర్వుల ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగులు శుభ్రమైన దుస్తులు ధరించాలని ఉందన్నారు. ఆ జీవో ప్రకారం, పురుష ఉద్యోగులు తమిళ సంప్రదాయం, దేశ పారంపర్యం తెలియజేసేలా ఫార్మల్‌ డ్రస్‌, ప్యాంట్‌, పంచె ధరించాలన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Chennai: అబ్బో.. పైత్యం బాగానే ముదిరిందిగా.. రీల్స్‌ మోహంతో ఆడవేషంలో బైక్‌ రైడింగ్‌..


కానీ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి ప్రభుత్వ కార్యక్రమాల్లో టీ-షర్ట్‌ వేసుకుని హాజరవుతున్నారని, రాష్ట్ర సచివాలయం మార్గదర్శకాలను మంత్రి కార్యాలయం, ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయన పాటించడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. అదే సమయంలో ఉదయనిధి వేసుకున్న టీ-షర్ట్‌పై డీఎంకే చిహ్నం ఉంటుందని, ప్రజా ప్రతినిధులు అన్న కోణంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే సమయంలో ఒక పార్టీ చిహ్నం వినియోగించే విధానంపై స్టే విధించాలని పిటిషన్‌లో కోరారు.


...........................................................

ఈ వార్తను కూడా చదవండి:

............................................................

Chennai: రాష్ట్రంలోనే తొలిసారిగా నీటిపై తేలియాడే సోలార్‌ ప్లాంట్‌

- కోవైలో ఏర్పాటు

- వినూత్న పద్ధతిలో విద్యుదుత్పత్తి

చెన్నై: రాష్ట్రంలోనే మొదటిసారిగా వాణిజ్యనగరమైన కోయంబత్తూరు(Coimbatore)లో చెరువుపై తేలియాడే సోలార్‌ ప్యానెళ్లతో విద్యుత్‌ ఉత్పత్తి చేసే పనులు చురుగ్గా సాగుతున్నాయి. నమక్కునామే పథకం కింద రూ.1.45 కోట్లతో జర్మన్‌కు చెందిన సంస్థతో కలిసి కోయంబత్తూరు కార్పొరేషన్‌ ఈ ప్రాజెక్టు చేపట్టింది. ఆ నగరంలోని ఉక్కడం పెరియకుళం చెరువులో అర ఎకరా విస్తీర్ణంలో సోలార్‌ప్యానెళ్ళను లంగరు వేసే పద్ధతి (ఆంకరింగ్‌ మెథడ్‌)లో తేలియాడేలా అమర్చారు.

nani5.2.jpg


ఆ సోలర్‌ ప్యానెళ్లకు ఎలాంటి ముప్పువాటిల్లకుండా ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు(CC cameras) కూడా ఏర్పాటు చేశారు. 24 గంటల కాపలాకు సిబ్బందిని కూడా నియమించారు. ఈ సోలార్‌ ప్యానెళ్ల ద్వారా రోజూ 154 కె.వి విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని కోయంబత్తూరు కార్పొరేషన్‌ అధికారులు తెలిపారు. మరో రెండు నెలల్లోగా అన్ని పనులు పూర్తయిన తర్వాత విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

nani5.jpg


ఇదికూడా చదవండి: Cyberabad police: ఆర్‌జే శేఖర్‌ బాషా అరెస్టు..

ఇదికూడా చదవండి: High Court: ఫోన్‌ ట్యాపింగ్‌ నిందితుడు రాధాకిషన్‌రావు

ఇదికూడా చదవండి: Bhupalpally: సింగరేణి ఓసీపీలతో దినదిన గండం!

ఇదికూడా చదవండి: Tummala: సోనియా పుట్టిన రోజు నాటికి రుణమాఫీ పూర్తి

Read Latest Telangana News and National News

Updated Date - Oct 19 , 2024 | 01:29 PM