Chennai: థ్యాంక్యూ సీఎం సార్.. స్టాలిన్‌కు ధన్యవాదాలు తెలిపిన పర్యావరణ నిపుణులు
ABN , Publish Date - Mar 03 , 2024 | 10:26 AM
తూత్తుకుడి జిల్లాలోని స్టెరిలైట్ కర్మాగారాన్ని శాశ్వతంగా మూసివేసేందుకు వీలుగా కఠిన చట్టాన్ని తీసుకుని రావడంతో పాటు కోర్టులో జరిగిన న్యాయపోరాటంలో ప్రభుత్వం తరపున బలమైనవాదనలు వినిపించినందుకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin)కు పర్యావరణ నిపుణులు కృతజ్ఞతలు తెలిపారు.
చెన్నై: తూత్తుకుడి జిల్లాలోని స్టెరిలైట్ కర్మాగారాన్ని శాశ్వతంగా మూసివేసేందుకు వీలుగా కఠిన చట్టాన్ని తీసుకుని రావడంతో పాటు కోర్టులో జరిగిన న్యాయపోరాటంలో ప్రభుత్వం తరపున బలమైనవాదనలు వినిపించినందుకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin)కు పర్యావరణ నిపుణులు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ఆళ్వార్‌పేటలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శనివారం సీఎం స్టాలిన్‌ను కలుసుకున్న వారిలో పర్యావరణ పరిరక్షణ నిపుణులైన సుందరరాజన్, ప్రభాకరన్, వైద్య సెల్వన్, జియో టామిన్, స్టెరిలైట్ ఉద్యమ కమిటీకి చెందిన కృష్ణమూర్తి, ఫాతిమా బాబు, హరిరాఘవన్, మహేష్ కుమార్, మెరీనా బాబు, సుజిత్, గుణశీలన్, రీగన్, రాజా, కదిర్ మిస్మి, అజ్మిత్, వసంతి, సిమ్లా, గోపాల్, వాంజినాథన్, మారియమ్మాళ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు సీఎంను అభినందించి, కృతజ్ఞతలు తెలిపారు. కాగా, గత 2018 మే నెల 22న స్టెరిలైట్ కర్మాగారానికి వ్యతిరేకంగా ఆందోళన చేసిన వారిపై పోలీసులు తుపాకీ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మృతుల కుటుంబాలకు గత ప్రభుత్వం ఇచ్చిన ఎక్స్‌గ్రేషియాకు అదనంగా సీఎం స్టాలిన్ మరో రూ.5 లక్షలు చొప్పున అందించారు. అలాగే, గాయపడిన 17 కుటుంబాలకు చెందిన వారికి కారుణ్య నియామకం కింద వారివారి విద్యార్హలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడంతో సీఎంకు మరోమారు అభినందనలు తెలిపారు. అలాగే, తనను కలిసిన పర్యావరణ నిపుణుల చేసిన విన్నపాల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటానని వారికి ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కనిమొళి కూడా పాల్గొన్నారు.