Tragic incident: పికప్ వ్యాను బోల్తాపడి 18 మంది దుర్మరణం
ABN , Publish Date - May 20 , 2024 | 04:35 PM
ఛత్తీస్‌గఢ్ లోని కవార్థా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న పికప్ వాహనం బోల్తాపడి 18 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 10 మంది గాయపడ్డారు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.
కవార్దా: ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లోని కవార్థా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న పికప్ వాహనం బోల్తాపడి 18 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 10 మంది గాయపడ్డారు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. అతివేగం కారణంగా వాహనం అదుపు తల్లి బోల్తాపడినట్టు ప్రాథమిక విచారణలో తెలిసింది. స్థానిక అధికారులు ఘటనా స్థలానికి తక్షణ సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు.
Chennai: అయ్యో పాపం.. అతిగా స్పందించిన నెటిజన్లు.. మహిళ ఆత్మహత్య..
రాష్ట్ర ప్రభుత్వం దిగ్భ్రాంతి
పికప్ వాహనం బోల్తాపడి భారీ దుర్ఘటన చేటుచేసుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధితులకు తక్షణ సాయం అందిస్తామని ప్రకటించింది. వారి కుటుంబ సభ్యులకు ఉపముఖ్యమంత్రి అరుణ్ సావో ఒక ట్వీట్‌లో సంతాపం తెలిపారు. అడువుల్లో తేయాకు సేకరించి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసిందని చెప్పారు. ఈ ప్రమాదంలో 15 మంది మరణించగా, 10 మంది గాయపడినట్టు కబీర్‌థామ్ పోలీస్ సూపరిటెండెంట్ డాక్టర్ అభిషేక్ పల్లవ్ ధ్రువీకరించారు.
Read Latest National News and Telugu News