Share News

Chief Minister: నేను సీఎం కావడం కొందరికి ఇష్టం లేదు..

ABN , Publish Date - Jul 12 , 2024 | 01:19 PM

మైసూరు నగరాభివృద్ది సంస్థ ముడా ఆధ్వానంగా మారిందని దారిలోకి తీసుకువస్తానని సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) వెల్లడించారు. శుక్రవారం మైసూరులోని నివాసం వద్ద ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఇదే సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘ముడా’ అవినీతిపై ఇద్దరు ఐఏఎస్‌(IAS) అధికారులు దర్యాప్తు చేస్తున్నారన్నారు.

Chief Minister: నేను సీఎం కావడం కొందరికి ఇష్టం లేదు..

- మా ప్రభుత్వంలోనూ తప్పులు జరిగాయి..

- అధ్వానంగా మారిన ముడా

- అవినీతిపై దర్యాప్తు చేపట్టిన ఐఏఎస్‌ అధికారులు

బెంగళూరు: మైసూరు నగరాభివృద్ది సంస్థ ముడా ఆధ్వానంగా మారిందని దారిలోకి తీసుకువస్తానని సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) వెల్లడించారు. శుక్రవారం మైసూరులోని నివాసం వద్ద ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఇదే సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘ముడా’ అవినీతిపై ఇద్దరు ఐఏఎస్‌(IAS) అధికారులు దర్యాప్తు చేస్తున్నారన్నారు. సమగ్ర నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామన్నారు. బీజేపీ పాలనలోనే కాకుండా తమ ప్రభుత్వంలోనూ తప్పులు జరిగాయని వాటిని సరిచేస్తానన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలకు తాను రెండోసారి ముఖ్యమంత్రి కావడమే ఇష్టం లేదన్నారు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. చట్టపరంగా విచారణ సాగుతున్న వివాదంపైనా రోజూ పనిగట్టుకుని ఆరోపణలు చేస్తున్నారన్నారు.

ఇదికూడా చదవండి: MLC: కాంగ్రెస్ అంటే.. వారిద్దరే కాదు..


తన భార్య పార్వతి పేరిట ఇంటి స్థలం కేటాయించడం అక్రమమే కాదన్నారు. బీజేపీ వ్యవధిలోనే తన భార్యకు ఇంటి స్థలం మంజూరు చేశారన్నారు. స్థలం వచ్చినప్పుడు తాను ప్రతిపక్ష నేతగా ఉన్నానన్నారు. ముడా తప్పు చేసి ఆతర్వాత పరిహారంగా స్థలం ఇచ్చిందన్నారు. భూమి కోల్పోయిన మేం స్థలం పొందడం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. తమకు ఇచ్చిన స్థలం వారే వాపసు తీసుకుని వడ్డీతో కలిపి రూ.62 కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. తాను రెండోసారి సీఎం కావడాన్ని జీర్ణించుకోలేని కొందరు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు.


ఇదికూడా చదవండి: Bengaluru : కర్ణాటకలో ‘ముడా’ స్కాం కలకలం

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 12 , 2024 | 01:19 PM