China: నరేంద్ర మోదీ గెలుపుపై చైనా ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Jun 04 , 2024 | 07:23 AM
2024 లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్(lok sabha election 2024 results) చాలా వరకు ప్రధాని మోదీ(Narendra Modi) ప్రభుత్వం మరోసారి గెలుస్తుందని జోస్యం చెప్పాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే భారత్‌లో మూడోసారి మోదీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ గెలుపుపై చైనాకు చెందిన నిపుణులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
2024 లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్(lok sabha election 2024 results) చాలా వరకు ప్రధాని మోదీ(Narendra Modi) ప్రభుత్వం మరోసారి గెలుస్తుందని జోస్యం చెప్పాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే భారత్‌లో మూడోసారి మోదీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ గెలుపుపై చైనాకు చెందిన నిపుణులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అయితే ఈసారి మాత్రం చైనా-భారత్ మధ్య వివాదం తగ్గుతుందని చైనా నిపుణులు అభిప్రాయపడ్డారు. గాల్వాన్ ఘర్షణ తర్వాత ఈ రెండు దేశాల మధ్య వివాదం గణనీయంగా పెరిగింది.
ఈ క్రమంలో భారత్-చైనా సంబంధాలలో(india-china relations) మరింత మెరుగుదల ఉంటుందని ఫుడాన్ విశ్వవిద్యాలయం దక్షిణాసియా అధ్యయనాల కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ లిన్ మిన్వాంగ్ అన్నారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావడం ద్వారా భారతదేశ విదేశాంగ విధానం, దౌత్యం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్‌కు సంబంధించి నరేంద్ర మోదీ విజయంతో భారతదేశం దేశీయ, విదేశీ విధానాలు మెరుగ్గా కొనసాగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. భారతదేశ ఆర్థిక వృద్ధిని పెంచేందుకు ప్రధాని మోదీ తన ప్రయత్నాలను కొనసాగించాలని భావిస్తున్నారని వెల్లడించారు.
ప్రధాని మోదీ(modi) ప్రధాన దృష్టి కొన్నేళ్లలో చైనా తర్వాత ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారతదేశాన్ని అగ్రగామిగా మార్చాలని ప్రధాన మంత్రి ఫోకస్ చేశారు. దౌత్య మార్గాల ద్వారా భారతదేశం ప్రపంచ ప్రభావాన్ని పెంచడానికి నరేంద్ర మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని సింఘువా విశ్వవిద్యాలయంలోని నేషనల్ స్ట్రాటజీ ఇనిస్టిట్యూట్‌లోని పరిశోధనా విభాగం డైరెక్టర్ కియాన్ ఫెంగ్ వెల్లడించారు.
చైనాతో సంబంధాలు భారతదేశానికి ముఖ్యమైనవని గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ చెప్పారు. భారత్, చైనాలు(bharat-china) తమ సరిహద్దుల్లో దీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదాన్ని తక్షణమే పరిష్కరించుకోవాలని, తద్వారా ద్వైపాక్షిక సంబంధాల్లో నెలకొన్న ఉద్రిక్తతను వీడాలని మోదీ అన్నారు. భారత్-చైనాల మధ్య శాంతియుత సంబంధాలు రెండు దేశాలకే కాకుండా ప్రపంచానికీ ముఖ్యమని మోదీ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి:
Planes Collide: గాల్లో ఢీ కొట్టుకున్న రెండు విమానాలు.. ఆ తర్వాత ఏమైందంటే?
Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా..ఈ మోసాల పట్ల జాగ్రత్త
Read Latest International News and Telugu News