Chiranjeevi: రేపు ఇంకెక్కడైనా రావొచ్చు.. బెంగళూరు నీటి సంక్షోభంపై చిరంజీవి కామెంట్స్
ABN , Publish Date - Mar 27 , 2024 | 09:15 PM
కర్ణాటక రాజధాని బెంగళూరులో తలెత్తిన నీటి సంక్షోభం కారణంగా అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. వందల మంది క్యూ లైన్‌లో నిల్చొని.. బిందెల్లో నీళ్లు పట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేని నీటి సమస్యని అక్కడి ప్రజలు ఎదుర్కుంటున్నారు.
కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరులో తలెత్తిన నీటి సంక్షోభం (Bengaluru Water Crisis) కారణంగా అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. వందల మంది క్యూ లైన్‌లో నిల్చొని.. బిందెల్లో నీళ్లు పట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేని నీటి సమస్యని అక్కడి ప్రజలు ఎదుర్కుంటున్నారు. ఈ నేపథ్యంలోనే.. నీటి విలువను తెలియజేస్తూ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు చేశారు. నీటి కరువు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించారు.
AP Politics: పరిపూర్ణానంద స్వామి బిగ్ ట్విస్ట్.. టికెట్ ఇవ్వకపోతే ఆ పని చేస్తా
“నేను చెప్పే విషయం పెద్దైనా చాలా ముఖ్యమైంది. నీరు మనందరి జీవనాధారం. ఇది ఎంతో విలువైంది. నీటి కొరత రోజువారి జీవితాన్ని కష్టతరం చేస్తుంది. ప్రస్తుతం బెంగళూరులో అలాంటి పరిస్థితే నెలకొంది. ఇటువంటి పరిస్థితి రేపు ఇంకెక్కడైనా రావొచ్చు. అందుకే.. నీటి సంరక్షణకు ప్రాధాన్యమిస్తూ, ఇంటిని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. బెంగళూరులోని నా ఫామ్‌హౌజ్‌లో పెర్మాకల్చర్ విధానాన్ని అమలు చేస్తున్నాను. 20-36 అడుగుల దిగువన ఉన్న రీఛార్జ్ బావులను (ఇంకుడు గుంతలు) (Recharge Wells) సైట్ మొత్తం వ్యూహాత్మక పాయింట్ల వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. రీఛార్జ్ బావులకు ఉపరితలంపై నీటి హరివాణులు నిర్మించబడ్డాయి. ప్రతి బావిలో ఫిల్టర్ సిస్టమ్, వివిధ కంకరలతో కూడిన సిల్ట్ ట్రాప్ ఉంటుంది’’ అని పేర్కొన్నారు.
Kolkata Airport: కోల్‌కతా ఎయిర్‌పోర్టులో ఢీకొన్న విమానాలు.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం
రీఛార్జ్ పిట్‌తో (Recharge PIT) పోలిస్తే రీఛార్జ్ బావుల్లో నీటిని ఎక్కువగా నిల్వ చేయొచ్చని చిరంజీవి తెలిపారు. లోతైన జలాశయాలను చేరుకోవడానికి ఉపరితలంలోని పోరస్ పొరల ద్వారా నీరు నెమ్మదిగా ప్రవహిస్తుందని అన్నారు. తాను పర్మాకల్చర్ సూత్రాలను అమలు చేస్తానన్న ఆయన.. ఇది పర్యావరణాన్ని పునరుజ్జీవనపరిచే వృత్తాకార తత్త్వం మీద పని చేస్తుందన్నారు. ఇది నీళ్ల డిమాండ్‌ని తగ్గించడమే దీని ప్రధాన లక్ష్యమన్నారు. ఈ చర్యలను చేపడితే.. నీటిని సంరక్షించవచ్చని, వర్షపు నీరు కొయ్యలను మెరుగుపరచవచ్చని చెప్పారు. పర్యావరణ అనుకూల గృహాలను నిర్మించాలని సలహా ఇచ్చారు. ఆ ట్వీట్‌కు తన ఫామ్‌హౌజ్ ఫోటోలను షేర్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి