Tejashwi Yadav: ఆ నలుగురి చేతిలో నితీష్ బందీ... తేజస్వి సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Dec 28 , 2024 | 06:23 PM
నితీష్ కుమార్ మరోసారి కూటమి మారే అవకాశాలపై శనివారంనాడిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో తేజస్విని మీడియా ప్రశ్నించినప్పుడు అలాంటి ఊహాగానాలకు తన వద్ద ఆధారాలేమీ లేవన్నారు.
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar)పై ఆర్జేడీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి సంబంధించి నితీష్ సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం లేదని, కొందరు సన్నిహితుల చేతిలో ఆయన 'బందీ'గా ఉన్నారని అన్నారు. నితీష్ కుమార్ మరోసారి కూటమి మారే అవకాశాలపై శనివారంనాడిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో తేజస్విని మీడియా ప్రశ్నించినప్పుడు అలాంటి ఊహాగానాలకు తన వద్ద ఆధారాలేమీ లేవని, అయితే బీహార్‌ను ఆయన నడపలేకపోతున్నారనేది మాత్రం తాను చెప్పగలనని అన్నారు.
AAP: 'ఆప్'కు షాక్... మహిళా సమ్మాన్ యోజన రిజిస్ట్రేషన్లపై ఎల్జీ కొరడా
''కుమార్ సొంతంగా నిర్ణయాలు తీసుకోలేక పోతున్నారు. సొంత పార్టీకి చెందిన నలుగురి చేతిలో ఆయన బందీగా ఉన్నారు. ఇద్దరు ఢిల్లీలో ఉండగా, ఇద్దరు ఇక్కడ ఉన్నారు" అని అన్నారు. తన వ్యాఖ్యలకు బలం చేకూర్చే సంఘటనలను ఆయన ప్రస్తావిస్తూ, బాబా సాహెబ్ అంబేడ్కర్‌ను కించపరచేలా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఇటీవల వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బీజేపీకి మద్దతిచ్చే విషయాన్ని పునరాలోచించాలని కుమార్‌కు 'ఆప్' సుప్రీం అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల లేఖ రాశారని, అయితే జేడీయూ నేత (వర్కిగ్ ప్రెసిడెంట్) సంజయ్ ఝా నుంచి సమాధానం వచ్చిందని అన్నారు. చాలా స్పష్టంగా సీఎం హోదాలో ఉన్న నితీష్ పేరుతో కేజ్రీవాల్ లేఖ రాస్తే సంజయ్ ఝా సమాధానం ఇవ్వడం ఏమిటని తేజస్వి ప్రశ్నించారు. దీనిని బట్టే బీహార్ రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చని అన్నారు.
ఇవి కూడా చదవండి..
National: ఢిల్లీలో అంత్యక్రియలు జరగని మాజీ ప్రధానులు ఎవరో మీకు తెలుసా.. వీరిలో తెలుగు వ్యక్తి కూడా..
Manmohan Singh Funeral: మన్మోహన్ సింగ్ అంతిమ యాత్రలో రాహుల్ గాంధీ ఏం చేశారంటే
Read More National News and Latest Telugu News